కాంగ్రెస్ ను వీడుతున్న కీలక నేతలు.. కారణమేంటి?

100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.. వరుసగా జాతీయ కాంగ్రెస్ పార్టీని అధికార ప్రతినిధులు వీడుతుండడం.. అసంతృప్తితో వైదొలుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. వైదొలిగే వారందరూ తమ అసంతృప్తిని దాచడం లేదు. కాంగ్రెస్ లోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్ తప్పులకు అగ్రనాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నేతలు వీడుతున్నారు. తాజాగా మొదట కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి స్వాతి చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు. […]

Written By: NARESH, Updated On : June 10, 2020 12:34 pm
Follow us on


100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.. వరుసగా జాతీయ కాంగ్రెస్ పార్టీని అధికార ప్రతినిధులు వీడుతుండడం.. అసంతృప్తితో వైదొలుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. వైదొలిగే వారందరూ తమ అసంతృప్తిని దాచడం లేదు. కాంగ్రెస్ లోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. కాంగ్రెస్ తప్పులకు అగ్రనాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నేతలు వీడుతున్నారు. తాజాగా మొదట కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి స్వాతి చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే శివసేనలో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా మారిపోయారు. ఈయన బాటలోనే కాంగ్రెస్ అధికార ప్రతినిధులంతా ఇప్పుడు బీజేపీ బాటపడ్డారు.

ఇక ఇవన్నీ కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. టీవీ చానెళ్లలో కాంగ్రెస్ తరుఫున వాగ్దాటిగా వాదించే ఎంతో పాపులర్ అయిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వి పార్టీలో కొనసాగుతున్న విషయాలపై అసమ్మతి నోట్ పార్టీకి పంపి కలకలం రేపారు.

ఇక మరో పాపులర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ జా కూడా టీవీ చానెల్ డిబేట్లలో అదరగొడుతుంటారు. తాజాగా పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. సానుకూల విమర్శలకు పార్టీ దయతో వ్యవహరించడం లేదని. తన తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించడం లేదన్నారు. హైకమాండ్ కు సుధీర్ఘ లేఖ రాయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈయన కూడా బీజేపీ బాటపట్టడం ఖాయమంటున్నారు.

ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీని ఒక్కరొక్కరుగా ఆ పార్టీ అధికార ప్రతినిధులంతా వీడుతుండడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండడం కాంగ్రెస్ కు షాకింగ్ గా మారింది. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు బీజేపీలో చేతిలో ఓడిపోవడం.. వచ్చేసారి కూడా గెలుపు కష్టమనే భావనతోనే నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు.

-నరేశ్ ఎన్నం