https://oktelugu.com/

కేసీఆర్ ఫెయిల్యూర్ కు అసలు కారణం అదేనా !?

అసలే కరోనా కాలం.. ఉద్యోగాలు పోయి.. ఉపాధి కోల్పోయి జనాలంతా లాక్డౌన్ లో నానా కష్టాలు పడ్డారు. దమ్మిడి సంపాదన లేక అరగోసపడ్డారు. ఇంతటి కష్టకాలంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? వారికి ప్యాకేజీ రూపంలో తృణమో, ప్రణమో ఇచ్చి ఆదుకోవాలి. కానీ ఘనత వహించిన కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ జనాల చెవిలో పిచ్చి పూలు పెట్టిందన్న విమర్శలు వచ్చాయి. కేసీఆర్ సార్ మాత్రం ఓ 1500 ఇచ్చి.. రేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 08:46 AM IST
    Follow us on

    అసలే కరోనా కాలం.. ఉద్యోగాలు పోయి.. ఉపాధి కోల్పోయి జనాలంతా లాక్డౌన్ లో నానా కష్టాలు పడ్డారు. దమ్మిడి సంపాదన లేక అరగోసపడ్డారు. ఇంతటి కష్టకాలంలో ప్రభుత్వాలు ఏం చేయాలి? వారికి ప్యాకేజీ రూపంలో తృణమో, ప్రణమో ఇచ్చి ఆదుకోవాలి. కానీ ఘనత వహించిన కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ జనాల చెవిలో పిచ్చి పూలు పెట్టిందన్న విమర్శలు వచ్చాయి. కేసీఆర్ సార్ మాత్రం ఓ 1500 ఇచ్చి.. రేషన్ బియ్యం ఇచ్చి ‘గమ్మున ఇంట్లో కుసుండి తినండ్ర భయ్’ అంటూ కాస్త ఊరటనిచ్చాడు.

    Also Read: కేసీఆర్‌‌కు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారా..?

    అయితే మరి కేసీఆర్ పై పాజిటివ్ వేవ్ ఉండాలి కదా.. అదంతా ఎక్కడికి పోయిందంటే.. స్పందించాల్సిన టైంలో స్పందించకుండా జనాల నెత్తిన భారం వేస్తే ఊరుకుంటారా? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడే ప్రజలే పాలకులు. ఇంతటి కరోనా కరువు కాలంలో వారిని హింసించే.. పీడించే.. వారి జేబులు ఖాళీ చేసేలా ప్లాన్లు చేస్తే ఊరుకుంటారా? అందుకే కేసీఆర్ సర్కార్ కు కాస్త కర్రు కాల్చి వాత పెట్టారు.

    దుబ్బాక ఎన్నికల్లో విజయం తథ్యం అన్న టీఆర్ఎస్ ను ఓడించడానికి ప్రధాన కారణం ‘ధరణి’ పేరిట.. ఎల్ఆర్ఎస్ పేరిట కేసీఆర్ సర్కార్ ప్రజల ఆస్తుల నుంచి వసూలు చేసిన డబ్బులు, ఆ వ్యయ ప్రయాసలేనట.. అవే జనాల కోపానికి అసలు కారణం అని టీఆర్ఎస్ పోస్టుమార్టంలో తేలిందట..

    అసలే దమ్మిడి సంపాదన లేక కరోనా కష్టకాలంలో అవస్థలు పడుతున్న జనాలకు వాళ్ల ఆస్తులు కాపాడుకోవడం.. రెగ్యులర్ ఆన్ లైన్ చేసుకోవడం తప్పనిసరి. అలాంటి టైంలో ఎల్.ఆర్ఎస్ పేరిట కేసీఆర్ సర్కార్ వసూళ్ల దందా మొదలుపెట్టడమే కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహానికి కారణమని తేలిందట..

    ఇప్పుడు చేతులు కాలాక కేసీఆర్ సర్కార్ ఆస్తిపన్నులో 50శాతం మాఫీ అని ప్రజలకు వరాలు ఇచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే 70శాతానికి పైగా జనాలు ఎప్పుడో ఆస్తిపన్ను కట్టేశారు. వచ్చే సంవత్సరం యాడ్ చేస్తామన్నా.. అది జనాలకు ఏమాత్రం తక్షణం ఉపయోగం కలిగించడం లేదు. ఇక ఈనెల 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ను మొదలుపెడుతున్నారు. ఇలా చేతులు కాలాక కేసీఆర్ సార్ ఆకులు పట్టుకున్న చందం నిష్ర్పయోజనం అంటూ జనాలే ఆడిపోసుకుంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ మేలుకొని నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే మొదటికే మోసం అంటున్నారు.

    Also Read: కేసీఆర్ కాచుకో ఇక.. తొడగొట్టిన బీజేపీ

    ఆరేళ్లుగా జనాలు కేసీఆర్ బాటలో నడిచారు. కానీ టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు మేలు చేసే కోణంలో వారి నుంచి పిండుడు ప్రోగ్రాం మొదలుపెట్టిందన్న ఆవేదన వారిలో కలుగుతోంది. ఇదే జనాల్లో ఆగ్రహానికి కారణమైందంటున్నారు. ఆస్తులను రెగ్యులర్ చేసుకోవడం అందరికీ అవసరమే. అదేసమయంలో పైసలకు కటకట ఉన్న ఈ కష్టకాలంలో వారు ఎక్కడి నుంచి ఆన్ లైన్ రెగ్యులర్ చేసుకోవాలన్నది పాలకులు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేయబట్టే ఇప్పుడు వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అయినా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు కేసీఆర్ పై వ్యతిరేకతకు ఆయన దుందుడుకు నిర్ణయాలు కారణమనేనన్న ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీని లైట్ తీసుకోవడం కూడా ఆయన కొంపకు ఎసరుపెడుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    జీహెచ్ఎంసీ వరదల లొల్లి ఎలాగూ కేసీఆర్ ను వెంటాడుతోంది. వరదసాయంలో గులాబీ నేతల చేతివాటం పీడిస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ తాజాగా తెలంగాణ ప్రజలపై వరాల మూట విప్పారు. నష్టనివారణ చర్యలు చేపట్టారు. మరి ఇప్పుడైనా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లుపడుతాయా? లేదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న అని విశ్లేషకులు చెబుతున్నారు.

    -ఎన్నం