ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి కొత్త కొత్త పథకాల అమలు ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నారు. ఇప్పటికే జగనన్న గోరుముద్ద, జగగన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన లాంటీ స్కీమ్ ల ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది.
Also Read: రాజాధిరాజా: జగన్ ఆస్థానంలో రాజగురువు!?
రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తూ సీఎం జగన్ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా విద్యాశాఖ 9 నుంచి ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక వెబ్ సైట్ ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. యునిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు కెరీర్ విషయంలో పొరపాట్లు చేయకుండా ఉండే విధంగా ఈ వెబ్ సైట్ ను రూపొందించారు.
Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖపై విచారణ.. నేడు ఏం జరుగనుంది?
విద్యార్థులు తమ గుర్తింపు సంఖ్య, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా వెబ్ సైట్ లో కెరీర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ వెబ్ సైట్ లో 21,000 కాలేజీల వివరాలతో పాటు, ప్రవేశ పరీక్షలు, స్కాలర్ షిప్ లకు సంబంధించిన సమాచారం సైతం అందుబాటులో ఉంటుంది. మరోవైపు జగన్ సర్కార్ పదో తరగతి విద్యార్థుల కోసం అకడమిక్ కేలండర్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ ను పొందుపరిచింది.
జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఇప్పటికే జగనన్న విద్యాదీవెన స్కీమ్ ద్వార షూ, సాక్సులు, పుస్తకాలు, నోట్స్ లను అందజేసింది. ప్రభుత్వం యూనిఫాం కుట్టుకూలీ డబ్బులను తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనుందని సమాచారం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్