2012-13 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) తర్వాత ఇదే అత్యల్ప వృద్ధిరేటు. ఆ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.3 శాతంగా నమోదైంది. తయారీ రంగంలో ఉత్పత్తి తగ్గడమే తాజా పతనానికి ప్రధాన కారణమని శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. గత ఆర్థిక సంవత్సర (2018-19) మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.6 శాతంగా నమోదైంది.
అయితే వ్యవసాయ రంగంలో ఏడాది క్రితం 2 శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో 3.5 శాతానికి పెరిగింది. అలాగే ఈ వృద్ధిరేటు ఆర్థిక, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసుల రంగంలో 6.5 శాతం నుంచి 7.3 శాతానికి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇతర సేవల రంగాల్లో 8.1 శాతం నుంచి 9.7 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో 6.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 5.1 శాతానికి క్షీణించిం
ఈక్విటీ మార్కెట్లు కుదేలవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయి కరెన్సీ వరుసగా ఆరో రోజు 63 పైసలు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.24 వద్ద నిలిచింది. 71.90 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఇంట్రాడేలో 72.29 కనిష్ఠ స్థాయిని తాకింది.
సెప్టెంబర్ 13, 2019 తర్వాత రూపాయికి ఇదే భారీ పతనం. కరోనా వైరస్ భయాలు ఫారెక్స్ మార్కెట్లకు చుట్టుకున్నాయని, ఫలితంగా దేశీయ కరెన్సీతోపాటు ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.