అదిరిపోయిన ‘కోబ్రా’ ఫస్టు లుక్

చియాన్ విక్రమ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘కోబ్రా’. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘కోబ్రా’ ఫస్టు లుక్కుతోనే విక్రమ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాడు. ఏడు విభన్న గెటప్ లతో ఉన్న విక్రమ్ ఫస్టు లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ‘కోబ్రా’ కొత్త గెటప్స్ వైరల్ గా మారుతున్నాయి. వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు విక్రమ్ ఎల్లప్పుడు ముందుంటాయి. సరికొత్త గెటప్పులతో విక్రమ్ ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాల్లో […]

Written By: Neelambaram, Updated On : February 29, 2020 11:14 am
Follow us on


చియాన్ విక్రమ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘కోబ్రా’. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘కోబ్రా’ ఫస్టు లుక్కుతోనే విక్రమ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాడు. ఏడు విభన్న గెటప్ లతో ఉన్న విక్రమ్ ఫస్టు లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ‘కోబ్రా’ కొత్త గెటప్స్ వైరల్ గా మారుతున్నాయి.

వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు విక్రమ్ ఎల్లప్పుడు ముందుంటాయి. సరికొత్త గెటప్పులతో విక్రమ్ ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాల్లో నటించి మెప్పించాడు. ‘అపరిచితుడు’లో విక్రమ్ ట్రిపుల్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెల్సిందే. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా ‘కోబ్రా’ మూవీ తెరకెక్కుతుంది. విక్రమ్ ఏడు విభిన్న గెటపుల్లో కనిపించనున్నట్లు సమాచారం.

‘కోబ్రా’లో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నట్టిస్తుంది. ఇర్ఫాన్ పటాన్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ బాణీలను సమకూరుస్తున్నాడు. ఈ మూవీని 7 స్ర్కీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలితకుమార్ నిర్మిస్తున్నారు. ‘కొబ్రా’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీని వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.