Cinema Tickets: సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న టికెట్ ధరల సమస్యపై స్పందించారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇలా టికెట్ ధరల విషయంలో తీసుకున్న చర్యలు తీవ్రమైన సమస్యకు దారి తీస్తుందని అన్నారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం పునరాలోలించాలని అన్నారు.
దీంతోే పాటు అఖండ సినిమాపై మాట్లాడిన ఆయన.. సినిమా పూర్తిగా బాలయ్య స్టామినాయేనని పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో చిరు సినిమాలు ఇలాంటి సమస్యే ఏదురైందని.. దాని వల్ల చెప్పపేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా.. టికెట్ ధరలకు అనుమతి ఇచ్చారని అన్నారు. సినీ పరిశ్రమకు దాసరి లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ లేదని.. ఆన్లైన్ టికెటింగ్ మాకు సహాయం చేస్తుంది కానీ ఈ ధరలు చాలా కష్టమని వివరించారు.
ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్తో సహా ప్రతి సీఎం టాలీవుడ్‌కు అందరూ సినీ పరిశ్రమకు అండగా ఉన్నారని.. ఇప్పుడు కాస్త గ్యాప్ వచ్చందని చెప్పారు. పారదర్శకతను కొనసాగించడానికి ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారని, అయితే సోషల్ మీడియా మొత్తం అంశాన్ని వక్రీకరించిందని కళ్యాణ్ అన్నారు.
Also Read: వైసీపీ ఎత్తుగడ.. ఉద్యోగుల్లో చీలికకు కారణమవుతుందా?
ప్రేక్షకులు ఏ ఇగోలు లేకుడా థియేటర్లకు వెళ్లి సినిమాను ఆస్వాధిస్తారని అఖండ సినిమా రుజువు చేసిందని అన్నారు. రాబోయే ప్రాజెక్టుల గురించి అడగ్గా.. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ శంకరాచార్య’ని నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదుచూస్తున్నట్లు వివరించారు. సత్యదేవ్, గాడ్సే దర్శకుడు గోపీ గణేష్‌లతో ప్రస్తుతం సినిమాలు తెరకెక్కుతున్నాయని నిర్మాత తెలిపారు. జనవరి 26న సత్యదేవ్ నటించిన గాడ్సే విడుదలవుతుందని చెప్పారు. రానా దగ్గుబాటితో కలిసి ఆయన నర్మించిన 1945 సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది వెల్లడించారు.
Also Read: అప్పుడు ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు అర్రులు చాస్తున్నారు !
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Government should reconsider ticket price issue says c kalya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com