AP Cinema Tickets: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ హైకోర్డు ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రబుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35పా విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ముందు ఈ అంశాన్ని జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆయనే ఈ నిర్ణయం తీసుకుంటారని థియేటర్ల యాజమాన్యానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది హైకోర్టు.
Also Read: టికెట్ రేట్లపై విచారణ వాయిదా.. పుష్ప మూవీకి బిగ్ రిలీఫ్..!
ఇటీవలే ఏప్రిల్ 8వ సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగి తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్ల యజమానులు, సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ జడ్జి.. జీవోను కొట్టిపడేస్తూ తీర్పు ఇచ్చారు. జీవో 35కు ముందు అనుసరించిన పద్దతిలోనే టికెట్ ధరలను నిర్ణయించుకునేలా కోర్టు ఆదేశాలు జారి చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ప్రస్తుతం దీనిపై ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే.. టికెట్ ధరలు పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుంది.. అయితే, ఇలా చేయడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. టికెట్ ధరల ప్రదిపాదనలను జాయింట్ కలెక్టర్‌కు సమర్పించాలని థియేటర్ యజమానులకు సూచించింది న్యాయస్థానం. అనంతరం ఇరువైపుల వాదనలు విని.. తీర్పును రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ap high court postpones discussion on government order 35
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com