Royal Enfield: కొన్నిసార్లు కొన్ని గమ్మత్తైన విషయాలు జరుగుతుంటాయి. అవి కాకతాళీయమో కానీ అవి చోటుచేసుకున్నప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. తాజాగా కేరళలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే మీరే నవ్వుకుంటారు. సరదాగా చేసిందా లేక పొరపాటుగా చేశారో కానీ ఇది మాత్రం నవ్వుకునే విషయమే. కేరళకు చెందిన బసిల్ శ్యామ్ కు రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనం ఉంది. రోజు తన వాహనం మీద కార్యాలయానికి వెళ్లి వస్తుంటాడు. ఆ రోజు కూడా అలాగే ఆఫీసుకు బయలుదేరాడు. కానీ వన్ వేలో రాంగ్ రూట్ లో వెళ్లడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు.

జరిమానా రాసి రిసిప్ట్ ఇచ్చాడు. దీంతో రూ.250 లు ఫైన్ కట్టి రిసిప్ట్ పట్టుకుని అతడు ఆఫీసుకు వెళ్లాడు. తీరా వెళ్లాక రిసిప్ట్ చూసుకుంటే అతడి మతిపోయింది. బైక్ లో సరిపడ పెట్రోల్ లేనందుకు జరిమానా విధిస్తున్నట్లు ఉండటంతో నవ్వుకున్నాడు దీన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో అది కాస్త వైరల్ అవుతోంది. రాష్ర్టమంతి చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. పోలీసులు ఇలా కూడా చేస్తారా? అని ప్రశ్నలు వేస్తున్నారు. మొత్తానికి పోలీసులు ఇక్కడ జోకర్ గా మారిపోవడం గమనార్హం.
Also Read: Nara Lokesh: రోడ్డున పడ్డ లోకేష్ బాబు..ఈ తోపుడు బండ్లు ఏంటి స్వామీ…
ఇక్కడో ట్విస్ట్ ఉంది. కేరళలో భారీ వాహనాల్లో తగినంత ఇంధనం లేకపోతే జరిమానా విధించే చట్టం ఉంది. కానీ అది భారీ వాహనాలకు ద్విచక్ర వాహనాలకు కాదు. దీంతో భారీ వాహనానికి వేయాల్సిన జరిమానా టూ వీలర్ కు వేయడమే చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చేసే చిలిపి చేష్టలకు నవ్వుకోవడం మన వంతే మరి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు జరిమానాలు వేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని సూచనలు చేస్తున్నారు. ఇలా నవ్వుల పాలయ్యే విధంగా నడుచుకోవద్దని సూచిస్తున్నారు.

పోలీసులు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. బండికి కూడా ఇంధనం తక్కువగా ఉందని ఫైన్ వేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారనే వాదనలు వస్తున్నాయి. పెద్ద వాహనాలైతే ప్రయాణికులతో వెళ్లే సమయంలో పెట్రోల్ అయిపోతే మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టాన్ని టూ వీలర్ కు కూడా ఆపాదించడమే చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ పోలీసుల తెలివికి అందరు ఫిదా అవుతున్నారు. తెలివిలో వారే ఫస్ట్ కానీ ఇలా చేయడంలో కూడా వారికి వారే సాటి అని పలువురు విమర్శలు చేస్తున్నారు.
Also Read: Telangana: డిగ్రీ అర్థం మారుతోంది.. తెలంగాణలో ప్రవేశ పెట్టే కొత్త కోర్సులు ఇవే