
తనకు బట్టతల ఉన్న విషయం చెప్పనందుకు పోలీసులకు ఓ భార్య ఫిర్యాదు చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని ఓ యువకుడికి గత నెలలో వివాహనం జరిగింది. చార్టడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఇతని బట్టతలను పెళ్లయిన కొన్ని రోజులకు ఆయన భార్య గమనించింది. ఈ విషయం పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదని నిలదీసింది. మాటమాట పెరిగి వాగ్వాదం కావడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.