Secret Behind Washing Feet: హిందూ ధర్మ శాస్త్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. వాటిని మనం పాటిస్తే మనకు మంచే జరుగుతుంది. అందుకే మన పూర్వీకులు అన్ని విషయాలు అవగాహన చేసుకుని భవిష్యత్ తరాలకు పనికి వచ్చే వాటినే చెప్పారు. అందుకే పెద్దల మాట సద్ది మూట అనడంలో అర్థం అదే. అలాంటి మన సనాతన సంప్రదాయంలో కొన్ని ఆచార వ్యవహారాలు కూడా మనకు గమ్మత్తుగా అనిపించినా అవి వాస్తవమే అనే విషయం గ్రహించుకోవాలి. మనం ఎటైనా బయటకు వెళ్లివచ్చినప్పుడు, తినే ముందు, పడుకునే క్రమంలో పాదాలను కడుక్కోవాలని ఓ ఆచారం ఉంది. ఇది వాస్తవమే. ఇందులో శాస్త్రీయతతో పాటు మన సంప్రదాయం దాగి ఉండటం గమనార్హం.

మనం ఇంటి నుంచి ఎటైనా బయటకు వెళ్లి వస్తే మన పాదాలు దుమ్ముతో నిండిపోతాయి. కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచినా దారిలో ఉండే దుమ్ము మన పాదాలకు అంటుకుంది. అదే దుమ్ముతో అలాగే ఇంట్లోకి వస్తే ఇల్లు కూడా అపరిశుభ్రంగా మారుతుంది. ఇల్లంతా దుమ్ముదుమ్ముగా మారుతుంది. అందుకే బయటకు వెళ్లి వచ్చేటప్పుడు కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం మంచిదే. దీని వల్ల బ్యాక్టీరియా కూడా లోనికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కాళ్లను శుభ్రం చేసుకోవడం మంచి అలవాటుగానే చెప్పుకోవాలి.
ఇక భోజనం చేసే ముందు కూడా కాళ్లను కడుక్కోవాలని మన హైందవ సంప్రదాయం చెబుతోంది. ఇందులో కూడా శాస్త్రీయత ఉంది. ఎందుకంటే బోజనంచేసే ముందు కూడా మన శరీర భాగాలు శుభ్రంగా లేకపోతే మనకే కదా అనారోగ్యం. అందుకే భోజనం చేసే ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కుని భోజనం మీద కూర్చుంటే బాగుంటుంది. ఎలాంటి అశుభ్రత లేకుండా ఉండి మనకు తినే తిండి కూడా బాగా ఒంటపడుతుంది. అందుకే భోజనానికి ముందు కూడా కాళ్లు కడుక్కోవాలనేది మన ఆచారాల్లో ఒకటి కావడం గమనార్హం.
రాత్రి పడుకునే ముందు కూడా కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలని మన సంప్రదాయం చెబుతోంది. పడుకున్నాక మన కాళ్లలో శక్తి చక్రాలు పనిచేస్తాయట. అవి సక్రమంగా పనిచేయాలంటే మనం కాళ్లు కడుక్కోవాల్సిందే. అందుకే మన పూర్వీకులు రాత్రి పడుకునే సమయంలో కూడా కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పడంలో అంతరార్థం ఇదే. పైగా పడుకునే ముందు కాళ్లు కడుక్కుంటే మంచి నిద్ర పడుతుందని కూడా శాస్త్రం. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకే కాళ్లు కడుక్కోవడం మీద మనవారు చెప్పిన సూత్రాలు ఆచరణీయమే కదా. అందరు పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతున్నారు.