https://oktelugu.com/

Name Astrology: ఈ నాలుగు అక్షరాలు పేర్లు ఉన్న అమ్మాయిలు అత్తింటివారికి అదృష్టాన్ని తీసుకెళ్తారట ! ఇందులో మీరున్నారా ?

Name Astrology: సాధారణంగా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి తర్వాత వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయి.ఈ క్రమంలోనే అల్లుడు అత్తవారింట అడుగు పెడితే అత్త వారికి అదృష్టం కలిసి రావడం లేదా కొత్త కోడలు ఇంటికి వచ్చిన వేళా విశేషం కొందరికి అదృష్టం వస్తే మరికొందరికి మాత్రం కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అమ్మాయి జాతకంలో రాశి చక్రాలు, శుభ గ్రహాలు ఫలితం వల్ల ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇకపోతే అమ్మాయి పేర్లు మొదటి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 23, 2022 / 04:05 PM IST
    Follow us on

    Name Astrology: సాధారణంగా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి తర్వాత వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయి.ఈ క్రమంలోనే అల్లుడు అత్తవారింట అడుగు పెడితే అత్త వారికి అదృష్టం కలిసి రావడం లేదా కొత్త కోడలు ఇంటికి వచ్చిన వేళా విశేషం కొందరికి అదృష్టం వస్తే మరికొందరికి మాత్రం కష్టాలు వెంటాడుతూ ఉంటాయి.

    ఈ క్రమంలోనే అమ్మాయి జాతకంలో రాశి చక్రాలు, శుభ గ్రహాలు ఫలితం వల్ల ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇకపోతే అమ్మాయి పేర్లు మొదటి అక్షరం ఈ నాలుగు అక్షరాలతో ఉన్నవారు అత్తవారి ఇంటికి కోడలిగా వెళితే ఆ ఇంటిలో అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి. మరి ఆ 4 అక్షరాల వారు ఎవరు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

    Astrology

    G అక్షరం: పేరు మొదటిలో G అనే అక్షరంతో మొదలయ్యే వారు అత్తవారింటికి అదృష్టవంతులుగా భావిస్తారు.ఈ పేరు గల అమ్మాయిలు అత్తవారింట్లో అడుగుపెట్టగానే తన భర్త జీవితమే కాకుండా అత్త మామ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది.ఇలాంటి పేరు గల వ్యక్తులు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఈమె అడుగుపెట్టిన చోట ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.

    Also Read: RRR Movie Pre Release Business: ఏపీ + తెలంగాణ : ‘ఆర్ఆర్ఆర్’ పక్కా బిజినెస్ లెక్కలివే

    K అక్షరం: పేరులో మొదటి అక్షరం K తో మొదలయ్యే అమ్మాయిలు కూడా అత్తవారింటికి ఎంతో అదృష్టం అని చెప్పాలి. వీరు ఉన్న చోట ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ పేరు గల వారు భర్త అత్తమామల నుంచి ఎంతో ప్రేమానురాగాలను అందుకుంటారు. వీరు ఉన్నచోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి.

    L అక్షరం: మొదటి అక్షరం L అని ఉన్న అమ్మాయిలు అత్తవారింటికి అదృష్టవంతులు.ఇలాంటి పేరు గల వారిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఈ క్రమంలోనే ఈమె అత్తవారింట్లో అడుగుపెట్టగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఆర్థిక కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.ఆరోగ్యం, సంపద పరంగా వీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి.

    P అక్షరం: మొదటి అక్షరం Pఅని పేరు పెట్టుకున్న అమ్మాయి అత్తవారింటికి ఎంతో అదృష్టం ఈమె అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత భర్త, అత్తమామల ప్రేమను సంపాదించుకుంటారు.ఈ పేరు గల అమ్మాయి ఇంట్లోకి అడుగుపెట్టగానే వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. అలాగే బంధువులతో వీరికున్న సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.

    Also Read: Congress Sonia Gandhi : మరణశయ్యపై కాంగ్రెస్.. మరోసారి త్యాగం చేసి బతికించు సోనియమ్మా!

    Recommended Video: