Sunflower Oil: హైదరాబాద్ : జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (GEF) ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సెగ్మెంట్‌లో ముందంజలో నిలిచింది. ఈ ఏడాది వాల్యూమ్ సేల్స్ ప్రకారం నంబర్ వన్ బ్రాండ్‌గా ర్యాంక్ పొందింది. (మార్చి 31, 2022తో ముగిసే సంవత్సరానికి భారతదేశంలో రిఫైండ్ ఆయిల్ కాన్స్ ప్యాక్ మార్కెట్‌పై నీల్సన్ IQ డేటా ప్రకారం). ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ,ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే ఉనికిని కలిగి ఉండగా ఈ సరికొత్త మైలురాయిని సాధించింది ఫ్రీడమ్.
రైస్ బ్రాన్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్‌గా కూడా లభ్యమయ్యే ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ – ఫ్రీడమ్ నాణ్యత, స్థిరత్వం విశ్వసనీయతను వారు అభినందిస్తున్నందున, బ్రాండ్ మరింతగా మార్కెట్లో కి చొచ్చుకుపోవడాన్ని, బ్రాండ్ కోసం వినియోగదారుల ప్రాధాన్యతను ర్యాంక్ హైలైట్ చేస్తుంది. నీల్సన్ IQ ద్వారా రిటైల్ ఇండెక్స్ సేవ గ్రోసర్స్, జనరల్ స్టోర్స్, కెమిస్ట్స్, కాస్మెటిక్ స్టోర్స్, పాన్ ప్లస్ స్టోర్స్ , మోడరన్ ట్రేడ్ స్టోర్‌లను కవర్ చేస్తుంది. GEF ఇండియా Globoil అవార్డు 2021లో ‘భారతదేశంలో ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ అత్యధిక దిగుమతిదారు’ విభాగంలో ప్లాటినం అవార్డును కైవసం చేసుకుంది. 2018లో, The Globoil India ‘Emerging Brand’ అవార్డు ‘ఫ్రీడమ్’ బ్రాండ్‌కు దక్కింది. ఇండియా టుడే ‘ఇస్పోస్ అర్బన్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే 2020’ ప్రకారం ‘ఫ్రీడమ్’ బ్రాండ్ భారతదేశంలోని టాప్ ఫైవ్ వంట నూనె బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.
Also Read: Minister KTR: రాజుతో కయ్యం.. మంత్రులతో నెయ్యం.. కేటీఆర్ కొత్త స్ట్రాటజీ ఇదేనా
సన్‌ఫ్లవర్ ఆయిల్ కేటగిరీలో మార్కెట్ లీడర్..
ఫ్రీడమ్ ఆయిల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కేటగిరీలో మార్కెట్ లీడర్‌గా ఉంది దాని విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్ కారణంగా దాని నాయకత్వ స్థానం ఉత్పత్తుల వ్యాప్తి సాధ్యమైంది. GEF ఇండియా కాకినాడ,కృష్ణపట్నం, నెల్లూరులో రోజుకు 2615 మెట్రిక్ టన్స్ మొత్తం సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాన్ని కలిగి ఉంది. ఈ సదుపాయంలో డెస్మెట్ బల్లెస్ట్రా (బెల్జియం) నుంచి పరికరాలు ఉన్నాయి. కృష్ణపట్నం FSSC 22000 సర్టిఫికేట్ పొందింది. కాకినాడలో మూడవ రిఫైనరీ కోసం పొందే ప్రక్రియలో ఉంది. డిజైన్,నాణ్యత రెండూ వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా ప్యాకేజింగ్‌పై కూడా కంపెనీ దృష్టి పెడుతుంది.
ఈ సందర్భంగా జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కేటగిరీలో 20.5% విలువతో ‘ఫ్రీడమ్’ భారతదేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించినందుకు మేము సంతోషిస్తున్నాం” మార్కెట్ వాటా (నీల్సన్ IQ MAT మార్చి 2022). ఇది మా వినియోగదారు-కేంద్రీకృత విధానం, పటిష్టమైన పంపిణీ నెట్‌వర్క్ , నాణ్యతపై దృష్టి పెట్టడం ఫలితంగా మా బ్రాండ్ ఈ విజయం సొంతం చేసుకుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉన్న తమిళనాడు, కేరళలో ప్రారంభించాలని మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు కూడా విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ,.. “భారతదేశంలో మార్కెట్ వాటా ప్రకారం ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నంబర్ వన్ గా మారడం మాకు చాలా ఆనందంగా ఉంది. కస్టమర్‌లకు మేము ధన్యవాదాలు తెలియ జేస్తున్నాము. విశ్వసనీయమైన బ్రాండ్‌ను నిర్మించడం, అధిక వినియోగదారు సంతృప్తిని నిర్ధారించడంపై నిరంతరం దృష్టి పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read: Age Difference in Marriage: వధువు, వరుడు వయసు మధ్య తేడా ఎంత ఉండాలో తెలుసా?