
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం కొత్త సేవలను తీసుకొచ్చింది. ఈ సేవలు ఎస్‌బీఐ క్రెడిట్‌కార్టు ఉపయోగించేవారికి అనుగుణంగా ఉంటాయి. క్రెడిట్‌కార్డు ఉపయోగించేవారు వారి లావాదేవీలపై టిమిట్‌ను ఏర్పాటు చేసుకొవచ్చు. టోకనైజ్డ్ ట్రాన్సాక్షన్లపై కూడా లిమిట్ పెట్టుకోవచ్చు. అలాగే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్లలో భాగంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్సన్లు, పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్లు, యాక్టివేట్ చేసుకునేదీ లేనిది వినియోగదారుల ఇష్టానికే వదిలేశారు. అంతార్జాతీయ ట్రాన్సాక్షన్లలో మళ్లీ ఏటీఎం, పీవోఎస్, కాంటాక్ట్‌లెస్, ఆన్‌లైన్ వంటి సర్వీసులను యాక్టివేట్ చేసుకోచ్చు. పిన్ లేకుండా రెండు వేల రూపాయల వరకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.