మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పథకం జాబ్ కార్డుల్లో బాలీవుడ్ సినీ నటీమణుల ప్రత్యక్షమయ్యాయి. దీపీకా పదుకునే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫొటోలతో నకిలీ జాబ్‌కార్డులు తయారు చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని జిర్న్యా జిల్లా పిపార్కెడా నాకా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లు, ఉపాధి పథకం సిబ్బంది వీరి ఫొటోలతో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసినట్లు వెల్లడైంది. ఈ కార్డులపై వారు పనికి వెళ్లకపోయినా రూ.30 వేలు డ్రా చేశారని పోలీసు దర్యాప్తులో తేలింది. సోను అనే లబ్ధిదారుడు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫొటోతో జాబ్ కార్డు ఉంది. అసలు లబ్ధిదారుడికి ప్రభుత్వం నుంచి డబ్బు రాకపోవడంతో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.