Site icon OkTelugu

ఏపీలో బీసీ కమిషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 56 బీసీ కులాల కార్పొరేషన్లు 139 బీసీ కులాలకు ప్రాతినిథ్యం వహిస్తాయని ప్రభుత్వం తెలిపింది. బీసీలకు పథకాలు వేగంగా అందించేందకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. ఈనెల 18న ఆయా కులాల వారీగా కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేసినట్లు ప్రబుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Exit mobile version