Online Cheating: దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. అవతలి వారిని మోసం చేస్తూ రూ. లక్షలు గుంజుతున్నారు. దీంతో బాధితులు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియని సందర్బంలో జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఎవరో అపరిచిత వ్యక్తులు ఫోన్ చేయడం మనల్ని ముగ్గులో దింపడం తరువాత మోసాలకు పాల్పడటం రివాజుగా మారింది. మనం ఫోన్ పెట్టేసే లోపే మన ఖాతా నుంచి డబ్బులు మాయం కావడం తెలిసిందే.

తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఓ సంఘటన అందరిని ఆశ్చర్యపరచింది. ఓ అగంతకురాలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఫోన్ చేసింది. అవతల నుంచి ఓ మహిళ నగ్నంగా మాట్లాడుతోంది. దీంతో వెంటనే అతడు ఫోన్ కట్ చేశాడు. ఈ నేపథ్యంలో వారి ఫోన్ ను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. సదరు ఇంజినీర్ వద్ద రూ. 25 లక్షలు గుంజారు. ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. ఇలా కొత్త కొత్త మోసాలతో అప్పనంగా డబ్బులు వసూలు చేయడం సంచలనంగా మారుతోంది.
ఆ మహిళ రూ.25 లక్షలు వసూలు చేయడమే కాకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉన్నపళంగా రూ.25 లక్షలు కొట్టేయడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఫోన్ ఎత్తేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. అవతలి వారు ఎవరైనా సరే వీడియో కాల్ ఎత్తకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇలాంటి మోసాలకు పాల్పడితే ఇక ఎలా రక్షణ ఉండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
లక్షల్లో టోకరా వేసే ఆన్ లైన్ మోసాలకు పాల్పడే బ్యాచులు దేశంలో కోకొల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మనం ఏం చేయకుండానే మన డబ్బులు నొక్కేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు అంత తేలిగ్గా దొరుకుతారా అనే అనుమానాలు ఉన్నాయి. మొత్తానికైతే చేయని తప్పుకు అతడు రూ.25 లక్షలు పోగొట్టుకుని నైరాశ్యంలో మునిగిపోయాడు. పోలీసులు నెంబర్ తో విచారణ చేస్తున్నా అది అంత తేలిగ్గా దొరికే వ్యవహారం కాదని పలువురు చెబుతున్నారు.