https://oktelugu.com/

తీరం దాటిన‘నివర్’‌‌.. ఫియర్‌‌

నివర్‌‌ తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చింది. అతితీవ్రమై తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే పరిస్థితులు ఉన్నాయి. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోందని.. కరైకల్‌, మామల్లపురం మధ్య బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం లోపు తీరం దాటొచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని తిరుమలలో భారీ వర్షం కురుసింది. అక్కడి హరిణి ఘాట్ రోడ్డు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో వాటిని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 10:46 AM IST
    Follow us on

    నివర్‌‌ తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చింది. అతితీవ్రమై తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే పరిస్థితులు ఉన్నాయి. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోందని.. కరైకల్‌, మామల్లపురం మధ్య బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం లోపు తీరం దాటొచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని తిరుమలలో భారీ వర్షం కురుసింది. అక్కడి హరిణి ఘాట్ రోడ్డు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో వాటిని తొలగించారు. తుఫాన్ అతితీవ్ర రూపం దాల్చడంతో తిరుమలను భారీ వర్షం ముంచెత్తుతోంది. శ్రీవారం ఆలయంలోకి కూడా నీళ్లు చేరడంతో మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు.

    Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి మాత్రం..?

    తుఫాన్‌ ప్రభావంతో గంటకు 120 నుంచి -145 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో పాపవినాశనంపైన ఉన్న పలు చెట్లు నేలకూలాయి. బాలాజీనగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద ప్రహరీ కూలి కొన్ని బైక్‌లు ధ్వంసమయ్యాయి. తిరుమలతో పాటు నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలో భాగంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.

    నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, నాయుడుపేట, తడ, సూళ్లూరుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావలి పట్టణాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆ ప్రాంతాలకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సురక్షితం కాని ఇళ్ల నుంచి ప్రజలు పునారాస కేంద్రాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. అలాగే రైతులు పంటలు దెబ్బతినకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది.

    Also Read: పీవీ, ఎన్టీఆర్‌‌లను వదలని ‘కాషాయ’ దండు

    మరోవైపు.. భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలోని 1600 చెరువులు నిండు కుండల్లా మారాయి. దీంతో చెరువులకు గండ్లు పడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో సముద్రంలోకి ఆ నీటిని విడుదల చేశారు. తీర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 5 వేల మంది సిబ్బందిని సహాయక చర్యల్లో పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 100 తుఫాన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్‌ – 1077ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తుఫాన్‌ కారణంగా కడప జిల్లాలోని స్కూళ్లకు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌‌ హరికిరన్‌ తెలిపారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ చెప్పారు. కడప కలెక్టరేట్‌, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అటు చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రేణిగుంటలో బాలాజీ కాలనీ నీటమునిగింది. తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లాలో విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్