
భారత్ క్రికెట్ టీం ఆడే ఒక్కో మ్యాచ్ కు రూ. 65 లక్షలు చెల్లించేలా బీసీసీఐతో ఎంపీఎల్ ఢీల్ కుదుర్చుకుంది. టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్ షిప్ ను ‘ఎంపీఎల్’ స్పోర్ట్స్ దక్కించుకుంది. బీసీసీఐ తో ఈ నవంబర్ నుంచి మూడేళ్ల (2023)వరకు ఈ ఒప్పందం ఉంటుంది. ఈ డీల్ లో భాగంగా బీసీసీఐ ఒక్కో మ్యాచ్ కు రూ. 65 లక్షలు ఆర్జించనుంది. అంతకుముందున్న స్పాన్సర్ నైకీ సంస్థ కొన్ని కారణాల వల్ల వైదొలగింది. అనంతరం బీసీసీఐ కొత్త బిడ్లను ఆహ్వానించింది. ఈ మేరకు వేసిన టెండర్లలో ఎంపీఎల్ స్పాన్సర్ షిప్ ను దక్కించుకుంది.