
దుబాయ్ వేదికగా జరుగుతున్న అమ్మాయిల మినీ ఐపీఎల్ -3 పోరుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్, మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మిథాలీ బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు సీజన్లలో సూపర్ నోవాస్ టైటిల్ గెలుచుకుంది. మరోసారి విజయం కోసం బరిలోకి దిగింది. ఇక మిథాలీరాజ్ ఈసారి ఎలాగైనా ఛాంపియన్ షిప్ సాధించాలని పట్టుబడుతోంది. కరోనా మహమ్మారితో సుధీర్ఘ విరామం తరువాత ప్లేయర్లు ఎలా ఆడుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సీజన్లో ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈనెల 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.