నవంబర్ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులా.. అసలు నిజమేంటంటే?

దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నవాళ్లకు సెలవుల గురించి కనీస అవగాహన ఉండాలి. సెలవులపై అవగాహన లేకపోతే బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందులు పడక తప్పదు. అయితే నవంబర్ నెలలో ఏకంగా 17 రోజులు సెలవులు అంటూ ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణ సెలవులతో పాటు పండుగలను కలుపుకుంటే మొత్తం 17 రోజులు బ్యాంకులు పని చేయవు. అయితే ఈ సెలవులలో ఎక్కువ […]

Written By: Navya, Updated On : October 27, 2021 7:44 pm
Follow us on

దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నవాళ్లకు సెలవుల గురించి కనీస అవగాహన ఉండాలి. సెలవులపై అవగాహన లేకపోతే బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందులు పడక తప్పదు. అయితే నవంబర్ నెలలో ఏకంగా 17 రోజులు సెలవులు అంటూ ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణ సెలవులతో పాటు పండుగలను కలుపుకుంటే మొత్తం 17 రోజులు బ్యాంకులు పని చేయవు.

అయితే ఈ సెలవులలో ఎక్కువ సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆయా రాష్ట్రాలలో జరుపుకునే పండుగల ఆధారంగా సెలవులను నిర్ణయించే అవకాశం ఉంటుంది. నవంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం 8 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయవు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దీపావళి, కార్తీక పౌర్ణమి మాత్రమే పండుగలు జరుపుకునే రోజులుగా ఉండనున్నాయి. వైరల్ అవుతున్న వార్తలలో నిజానిజాలను తెలుసుకుని బ్యాంక్ పనులు జరుపుకుంటే మంచిది.

రెండు పండుగలతో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా సెలవు దినాలుగా ఉండనున్నాయి. బ్యాంకు అధికారులు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచనలు చేస్తున్నారు. పుకార్లను నమ్మకుండా ఉండటం ద్వారా బ్యాంకు సంబంధిత పనుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలిగే ఛాన్స్ అయితే ఉండదని చెప్పవచ్చు.

నవంబర్ 4వ తేదీన దీపావళి పండుగ కాగా నవంబర్ 7వ తేదీ ఆదివారంగా ఉండనుంది. నవంబర్ 19వ తేదీ కార్తీక పౌర్ణమి కాగా నవంబర్ 21వ తేదీ ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉండనుంది. నవంబర్ నెల 27వ తేదీ నాలుగో శనివారం కాగా నవంబర్ 28వ తేదీ ఆదివారం కూడా సెలవు దినంగా ఉండనుంది.