https://oktelugu.com/

రైతులకు అలర్ట్.. ఆ కార్డు ఉంటేనే పీఎం కిసాన్ లో చేరే అవకాశం?

కేంద్రం రైతుల కోసం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. దేశంలోని అర్హత ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు అందే విధంగా చేస్తోంది. కేంద్రం అదే సమయంలో మోసపూరితంగా ఈ పథకం ప్రయోజనాలను పొందేవాళ్లకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రేషన్ కార్డ్ వివరాలను సమర్పించాలి. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రేషన్ కార్డ్ సాఫ్ట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 28, 2021 / 08:26 AM IST
    Follow us on

    కేంద్రం రైతుల కోసం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. దేశంలోని అర్హత ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు అందే విధంగా చేస్తోంది. కేంద్రం అదే సమయంలో మోసపూరితంగా ఈ పథకం ప్రయోజనాలను పొందేవాళ్లకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రేషన్ కార్డ్ వివరాలను సమర్పించాలి.

    పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రేషన్ కార్డ్ సాఫ్ట్ కాఫీ, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ ఫారమ్ సాఫ్ట్ కాపీలను సమర్పించడం వల్ల ఈ స్కీమ్ బెనిఫిట్స్ కు అర్హత పొందే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు డిసెంబర్ నెల 15వ తేదీన పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన పదో విడత డబ్బులు పొందే ఛాన్స్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

    ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం రైతుల ఖాతాలలో నగదును జమ చేయనుండగా దరఖాస్తు విధానంలో తప్పులు చేస్తున్న రైతులకు మాత్రం పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన నగదు జమ కావడం లేదు. ఈ స్కీమ్ కు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. యాప్ ను డౌన్ లోడ్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

    ఏ కారణం చేతనైనా నగదు జమ కాని పక్షంలో సమీపంలో వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించి స్కీమ్ కు సంబంధింధిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.