భారత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మృతి..

ఫుట్‌బాల్‌ భారత మాజీ కెప్టెన్‌ కార్ల్‌టన్‌ చంపాన్‌ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. 1971 ఏప్రిల్‌ 13న కర్ణాటకలో జన్మించిన చంపాన్‌ టాటా ఫుట్‌బాల్‌ అకాడమీ (టీఎఫ్‌ఏ) టీమ్‌కు మిడ్‌ ఫీల్డర్‌గా ఆడాడు. ఆ తరువాత కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. 2001లో రిటైర్మెంట్‌ ప్రకటించి ఆ తరువాత ఫుట్‌బాల్‌ కోచ్‌గా మారాడు. కెప్టెన్‌గా, క్లబ్‌ లెవల్లో విజయవంతంగా ఆడినట్లు క్రీడాకారులు చెప్పుకుంటారు. తూర్పు బెంగాల్‌, జేసీటి మిల్స్‌లో సత్తాచాటి ఇండియన్‌ ఫుట్‌బాల్‌ క్రీడకు గుర్తింపు తీసుకొచ్చాడు. […]

Written By: Suresh, Updated On : October 12, 2020 12:09 pm
Follow us on

ఫుట్‌బాల్‌ భారత మాజీ కెప్టెన్‌ కార్ల్‌టన్‌ చంపాన్‌ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. 1971 ఏప్రిల్‌ 13న కర్ణాటకలో జన్మించిన చంపాన్‌ టాటా ఫుట్‌బాల్‌ అకాడమీ (టీఎఫ్‌ఏ) టీమ్‌కు మిడ్‌ ఫీల్డర్‌గా ఆడాడు. ఆ తరువాత కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. 2001లో రిటైర్మెంట్‌ ప్రకటించి ఆ తరువాత ఫుట్‌బాల్‌ కోచ్‌గా మారాడు. కెప్టెన్‌గా, క్లబ్‌ లెవల్లో విజయవంతంగా ఆడినట్లు క్రీడాకారులు చెప్పుకుంటారు. తూర్పు బెంగాల్‌, జేసీటి మిల్స్‌లో సత్తాచాటి ఇండియన్‌ ఫుట్‌బాల్‌ క్రీడకు గుర్తింపు తీసుకొచ్చాడు. ఆయన మృతి వార్త తెలుసుకున్న క్రీడాభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.