భారతదేశ టాప్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు ఫిిక్స్‌డ్ డిపాజిట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. 7 రోజుల నుంచి 29 రోజుల కాల పరిమిలోని ఎఫ్‌డీలపై 2.5 శాతం, 30 రోజుల నుంచి 990 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వరకు వడ్డీ రేటు తగ్గించినట్లు పేర్కొంది. అలాగే 91 రోజుల నుంచి 184 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం వస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ రేట్లు ఈనెల 21 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.