Husband and Wife?: మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే వాస్తు నియమాలు పాటించాలి. వాస్తు ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో కచ్చితమైన వాస్తు పద్ధతులు పాటిస్తేనే మనకు ప్రయోజనం కలుగుతుంది. లేదంటే ప్రతికూల ప్రభావాలు రావడం సహజమే. దీంతో వాస్తు నియమాలు లేనిదే ఏ ఇల్లు కూడా మనుగడ సాగించదు. అందుకే మనం ప్రతి వస్తువును అమర్చుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన ఇంటి పరిసరాల్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో కూడా స్పష్టంగా తెలుసుకుంటే మంచిది.
వాస్తు ప్రకారం మన ఇంటి ఉత్తరం, తూర్పు, ఈశాన్యం దిశల్లో ఎలాంటి బరువులు ఉండకూడదు. ఈ దిశల్లో చెత్త ఉంచకూడదు. ఒకవేళ ఉంచినట్లయితే మన ఇంటికి అరిష్టమే కానుంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. అందుకే ఆలుమగల మధ్య బేషజాలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. దీన్ని అందరు గ్రహించుకుని వాస్తు పద్ధతులు పాటించి ఎలాంటి గ్రహపాట్లు రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు రక్షణ ఉంటుంది. ఇంటి ముందు ముళ్లు, పాలతో కూడిన చెట్లు పెంచకూడదు. ఇదివరకే ఆ మొక్కలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాలి. లేదంటే అనర్థాలు జరుగుతాయి.
ఇంటి ముందు చెత్తకుండీ ఉంచకూడదు. దీంతో కూడా మనకు నష్టమే కలుగుతుంది. వాస్తు పద్ధతి ప్రకారం చెత్తకుండీని మన ఇంటి ఎదురుగా కాకుండా మరోచోట ఉంచేలా చూసుకోవాలి. ఇంకా క్రూరమైన జంతువుల చిత్రాలు కూడా ఉండకూడదు. హింసాత్మక సంఘటలను చూపించే చిత్రాలు కూడా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. దీంతో వాస్తు పద్ధతులు తప్పకుండా ఆచరించాలి. అప్పుడే మనకు రక్షణ కలుగుతుందనడంలో సందేహం లేదు. వాస్తు నియమాలు ఆచరిస్తేనే ఎన్నో లాభాలు ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Anchor Anasuya: పక్కనే భర్త ఉన్నాడని కూడా లేకుండా పబ్లిక్ లో అనసూయ దారుణం… ఏం చేసిందో చూడండి!
ఇంట్లో చారిత్రక కట్టడాల చిత్రాలు పెట్టుకుంటే వాటిని ఉప్పు నీటితో తుడవాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. ఇంకా గదిలో పర్వతం చిత్రాన్ని ఉంచుకుంటే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంకల్పం బలపడుతుంది. తొమ్మిది రోజుల పాటు రామాయణం పారాయణం చేస్తే కూడా మంచి జరుగుతుంది. వాస్తు దోషాలు పోవాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఇల్లు ముప్పును ఎదుర్కొంటుంది. దీనికి గాను మనం వాస్తు నియమాలతోనే మన ఇంటిని దోషాలు లేకుండా కాపాడుకోవచ్చు.