
కేరళలోని ప్రముఖ శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం భక్తుల దర్శనం ప్రారంభమైంది. ఈరోజు 246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయం తలుపులు తెరుచుకోగా శనివారం నుంచి దర్శనం ప్రారంభమైంది. గతంలో రోజుకు వెయ్యి మందికి భక్తుల దర్శనానికి అనుమతి ఉండగా కోవిడ్ కారణంగా ప్రస్తుతం రోజుకు కేవలం 246 మందికే అనుమతినిచ్చింది ఆలయ బోర్డు. కేరళలో కరోనా వ్యాప్తి అధికమవుతున్నందున భక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ట్రావెన్‌కోర్ బోర్డు సూచిస్తోంది. మాస్కులు ధరించాలని, శానిటైజర్ చేసుకోవాలని కోరింది.