మారిన ఫేస్ బుక్ పేరు.. కొత్త పేరు వెనుక అసలు కారణాలివే?

ఫేస్ బుక్ సంస్థకు మార్క్ జుకర్ బర్గ్ సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫేస్ బుక్ పేరు మారుతుందని వార్తలు ప్రచారంలోకి రాగా చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. జుకర్ బర్గ్ ఫేస్ బుక్ సంస్థ పేరును మెటాగా మార్చారు. తాజాగా జుకర్ బర్గ్ కంపెనీకి సంబంధించిన కొత్త పేరుతో పాటు లోగోను కూడా ప్రకటించారు. దీని పూర్తి పేరు మెటావర్స్ కాగా మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ స్పేస్ అనే అర్థం వస్తుంది. […]

Written By: Navya, Updated On : October 29, 2021 10:24 am
Follow us on

ఫేస్ బుక్ సంస్థకు మార్క్ జుకర్ బర్గ్ సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫేస్ బుక్ పేరు మారుతుందని వార్తలు ప్రచారంలోకి రాగా చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. జుకర్ బర్గ్ ఫేస్ బుక్ సంస్థ పేరును మెటాగా మార్చారు. తాజాగా జుకర్ బర్గ్ కంపెనీకి సంబంధించిన కొత్త పేరుతో పాటు లోగోను కూడా ప్రకటించారు. దీని పూర్తి పేరు మెటావర్స్ కాగా మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ స్పేస్ అనే అర్థం వస్తుంది.

నిన్న కంపెనీ కనెక్ట్ ఈవెంట్ లో భాగంగా కొత్త లోగోకు సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. అయితే మాతృసంస్థ పేరు మారినప్పటికీ ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ పేర్లు మాత్రం మారవని ప్రకటన వెలువడింది. అయితే ఈ విధంగా మాతృసంస్థ పేరు మార్చడానికి ముఖ్యమైన కారణమే ఉందని తెలుస్తోంది. ఫేస్ బుక్ అనే ఒకే ఒక్క పదం ద్వారా భవిష్యత్తులో ఈ సంస్థ ఏం చేయబోతుందనే విషయాలను వెల్లడించడం సాధ్యం కాదు.

మెటావర్స్ అనే పదం వల్ల ఫేస్ బుక్ కు సంబంధించిన యాప్స్ ను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వర్చువల్ రియాలిటీ ఉత్పత్తులకు ఫేస్ బుక్ ప్రతిబింబంగా నిలవనుందని తెలుస్తోంది. మెటా యూరప్ మార్కెట్ ను శాసించడంతో పాటు ప్రపంచ దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ ఆధారంగా నడిచే సేవలకు చిరునామాగా మారాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం. అయితే టెక్ నిపుణులు మాత్రం పేరు మార్పు వెనుక ఇతర కారణాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫేస్ బుక్ ఈ మధ్య కాలంలో ప్రైవసీ, సేవల్లో అంతరాయం ఇతర విషయాలలో తీవ్రంగా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. కంపెనీపై వస్తున్న ఆరోపణలను, కంపెనీలపై ఎదుర్కొంటున్న వివాదాలను దృష్టి మరల్చే ప్రయత్నాన్ని చేస్తున్నారని టెక్ నిపుణులు భావిస్తుండటం గమనార్హం.