https://oktelugu.com/

Varudu Kaavalenu Twitter Review: ‘వరుడు కావలెను’ ట్విట్టర్ రివ్యూ

Varudu Kaavalenu Twitter Review: విలక్షణమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ సక్సెస్ రేటును కలిగి ఉన్న యంగ్ డైనమిక్ హీరో నాగశౌర్య. ప్రేక్షకులను అలరించడంలో హీరో నాగశౌర్య ఎప్పుడూ ముందుంటారు. ఈ హీరో సినిమా మినిమం గ్యారెంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. సినిమాలో ఖచ్చితంగా విషయం ఉండి.. ప్రేక్షకులను మెప్పించే హీరో ఇతడు. గత ఏడాది నటించిన ‘అశ్వథ్థామ’ మూవీ తర్వాత తాజాగా ‘వరుడు కావలెను’ సినిమాను నాగశౌర్య పూర్తి చేశాడు. ఇప్పటికే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2021 / 10:15 AM IST
    Follow us on

    Varudu Kaavalenu Twitter Review: విలక్షణమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ సక్సెస్ రేటును కలిగి ఉన్న యంగ్ డైనమిక్ హీరో నాగశౌర్య. ప్రేక్షకులను అలరించడంలో హీరో నాగశౌర్య ఎప్పుడూ ముందుంటారు. ఈ హీరో సినిమా మినిమం గ్యారెంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. సినిమాలో ఖచ్చితంగా విషయం ఉండి.. ప్రేక్షకులను మెప్పించే హీరో ఇతడు. గత ఏడాది నటించిన ‘అశ్వథ్థామ’ మూవీ తర్వాత తాజాగా ‘వరుడు కావలెను’ సినిమాను నాగశౌర్య పూర్తి చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లు, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నాయి. ఈరోజు సినిమా విడుదలైంది. టాక్ బయటకు వచ్చింది.

    Varudu-Kaavalenu-Movie

    యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వరుడు కావలెను’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 29న థియేటర్లలోకి వచ్చింది.

    సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చివరి నిమిషంలో మంచి హైప్ వచ్చింది.. ఇక ‘వరుడు కావలెను’ సినిమా ప్రీమియర్ షోస్ ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ప్రదర్శితమయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

    ప్రస్తుతానికి సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా యావరేజ్ గా ఉందని కొందరు అంటే.. మరికొందరు మాత్రం పర్లేదు అని అంటున్నారు. మొత్తానికి సినిమాలో పాటలు, స్క్రీన్ ప్రెజెన్స్, హీరో హీరోయిన్ చాలా బాగా కనిపించారని అంటున్నారు.

    సినిమాలో మ్యూజిక్, కొన్ని సీన్లు, ప్రొడక్షన్ వాల్యూస్ హైలెట్ అని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలెట్ అని.. అక్కడ వచ్చే 15 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషన్స్ తో కట్టిపడేస్తాయి అని తెలుస్తోంది. సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.