https://oktelugu.com/

Anand Mahindra: పెళ్లి విందులో అప్పడం లొల్లి! నవ్వులు పూయిస్తున్న ఆనంద్ మహీంద్రా వీడియో..

Anand Mahindra: పెళ్లిలో మగపెళ్లివారికి అప్పడం వడ్డించలేదని గొడవకు దిగి తుక్కుతుక్కు చేసిన ఘటన ఇటీవల కేరళలో చోటుచేసుకుంది. ఒక అప్పడం వేయనందుకు పెళ్లిలో రణరంగం సృష్టించారు. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన ఈ రచ్చలో పాపం కుర్చీలు, ఫర్నీచర్ విరిగి రూ.1.5 లక్షల నష్టం వాటిల్లింది. ఒక అప్పడం కోసం ఇంత నష్టం వాటిల్లడంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సెటైర్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ అప్పడం పోరాటానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2022 / 05:03 PM IST
    Follow us on

    Anand Mahindra: పెళ్లిలో మగపెళ్లివారికి అప్పడం వడ్డించలేదని గొడవకు దిగి తుక్కుతుక్కు చేసిన ఘటన ఇటీవల కేరళలో చోటుచేసుకుంది. ఒక అప్పడం వేయనందుకు పెళ్లిలో రణరంగం సృష్టించారు. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన ఈ రచ్చలో పాపం కుర్చీలు, ఫర్నీచర్ విరిగి రూ.1.5 లక్షల నష్టం వాటిల్లింది. ఒక అప్పడం కోసం ఇంత నష్టం వాటిల్లడంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సెటైర్ వేశారు.

    Anand Mahindra

    దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ అప్పడం పోరాటానికి ఓ సరికొత్త పేరును సూచించాల్సిందిగా కోరారు.

    పెళ్లిలో అప్పడం బాగుందని వేయాలని వరుడి స్నేహితులు కోరగా.. ఆడ పెళ్లి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారి మధ్య వాగ్వాదం గొడవకు దారితీసింది. ఇది శృతిమించి ఇరువర్గాలు కొట్టుకునేదాకా వెళ్లింది. ఫంక్షన్ హాల్ లోని ఫర్నిచర్, కుర్చీలు సహా దాదాపు ఈ గొడవలో 1.5 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన ఆడిటోరియ యజమాని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.

    ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడందరూ వీడియో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా కూడా షేర్ చేసి ఒక అప్పడం కోసం ఇలా కొట్టుకుంటారా? ఇంత నష్టం చేస్తారా? అంటూ ఆశ్చర్యపోయారు.

    Tags