Payal Rajput: ఎవరి బాధ వాళ్ళది. అయినా తమ వస్తువుల విషయంలో సామాన్య జనమే కాదు, సినీ ప్రముఖులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయంలో తాజాగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నిదర్శనంగా నిలిచింది. విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పాయల్ బయట పెట్టింది. ఓ ప్రైవేటు విమానయాన సంస్థ సిబ్బంది దుందుడుకుతనమే ఇందుకు ప్రధాన కారణమని ఈ హాట్ హీరోయిన్ తెగ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పైగా ఈ సందర్భంగా డ్యామేజీ అయిన తన లగేజీ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. ఇటీవలే ఇండిగో విమానంలో పాయల్ రాజ్‌పుత్ ప్రయాణించింది. అయితే, ఆ సమయంలో తన లగేజీ విషయంలో ఇండిగో విమాన సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, తన బ్యాగ్ లను వాళ్ళు విసిరిపారేశారని ఆమె కామెంట్స్ చేసింది.
మొత్తానికి ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవం పాయల్ వివరించింది.
ఏది ఏమైనా టాలీవుడ్ లో యువతకి క్రష్ గా మారిన బ్యూటీలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే కుర్రాళ్లని అట్రాక్ట్ చేసింది. గత ఏడాది వరకు పాయల్ రాజ్ పుత్ కెరీర్ టాలీవుడ్ లో బాగానే సాగింది. కానీ, ప్రస్తుతం పాయల్ కెరీర్ అయోమయంలో పడింది. ఈ ఏడాది ఆరు నెలలు గడుస్తున్నా ఆమె చేతిలో ఒక్క కొత్త ఆఫర్ కూడా లేదు.

‘ఆర్ఎక్స్ 100’ మూవీలో పాయల్ రాజ్ పుత్ జోరు చూశాక తప్పకుండా ఈ యంగ్ బ్యూటీ టాప్ లీగ్ కి వెళుతుందని భావించారు. మతి పోగొట్టే ఒంపు సొంపులతో కుర్రాళ్లని పాయల్ విపరీతంగా ఆకర్షించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత పాయల్ తన రెమ్యునరేషన్ పెంచుతూ వచ్చింది. సక్సెస్ జోరులో కొన్ని చిత్రాలకు పాయల్ రాజ్ పుత్ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చారు నిర్మాతలు.
కానీ, పాయల్ రాజ్ పుత్ కి వరుసగా ప్లాపులు పడ్డాయి. ఆ తర్వాత కూడా పాయల్ రెమ్యునరేషన్ పెంచేసింది. ప్రస్తుతం ఈ భారీ బ్యూటీ ఏకంగా కోటి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోటి నుంచి ఒక్క రూపాయి కూడా తగ్గడం లేదట. దీంతో నిర్మాతలు పాయల్ ని సంప్రదించడం మానేశారు. ఈ ఏడాది పాయల్ రాజ్ పుత్ ఒక్క ఆఫర్ కూడా అందుకోకపోవడానికి కారణం ఇదే.
Check in luggage damaged by Indigo, brutally handled by the staff. Worst experience guys! @IndiGo6E pic.twitter.com/B0dwvtWj0Y
— paayal rajput (@starlingpayal) September 14, 2022