‘ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు. గొప్పవాడు..’ అన్న సినిమా డైలాగ్ లాగా గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి కేసీఆర్ ప్రసంగించారు. పదునైన, పరుష పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఉద్యమనేత దీనికి పూర్తి భిన్నంగా ఎన్నికల ప్రచారం సాగించారు. తమ అభివృద్ధి గురించి సాధికారికంగా వివరిస్తూనే, ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు ఉద్బోధించారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వకుండానే ప్రజలను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కేవలం తాను ప్రజలకు ఏం చేశాను.. ఏం చేయబోతానో అన్నదే ప్రధానంగా చెప్పారు.
Also Read: ఎంఐఎం అతిపెద్ద పార్టీగా మారుతుందా..?
హైదరాబాద్ ప్రజలకు మరోసారి ఉచిత మంచి నీటి హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి నెలకు 20వేల లీటర్ల ఉచిత నీటిని అందిస్తామని.. రాబోయే రోజుల్లో 24 గంటలూ మంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.
20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేశాం.. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు.. దీన్ని అపార్ట్‌మెంట్లకూ వర్తింపజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరమని, ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలని.. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు.
Also Read: హైదరాబాద్.. భాగ్యనగరం.. ఇందులో ఏదీ అసలు పేరు..?
లేకుండా ముందుకెళ్లాం. కరెంట్ సమస్యను పరిష్కరించాం. 24 గంటలూ కరెంట్ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్ భగీరథను విజయవంతం చేశాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్‌లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ పథకాలు ఎక్కడా లేవని’’ ఆయన పేర్కొన్నారు.
మేనిఫెస్టో సందర్భంగాప్రకటించిన హమీలకు కేసీఆర్ మరిన్ని మెరుగులు అద్దారు. ప్రతి బడ్జెట్‌లో హైదరాబాద్‌కు 10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వరదల అంశం ప్రధానంగా మారడంతో దానిపైనా వివరణ ఇచ్చారు. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాలోనూ వరదలొచ్చాయన్నారు. వరదలు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకే ఇంటికి పదివేలు ఇచ్చామన్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఆరున్నర లక్షల మందికి 650 కోట్లు ఇచ్చాం. ఇంకో 400 కోట్లయినా ఇస్తామని హామీ ఇచ్చారు. అపార్టుమెంట్ల వాసులకూ ఉచిత మంచినీరును కేసీఆర్ ప్రకటించారు. హామీలు.. చేసిన పనులే కాకుండా.. ప్రజలను ఆలోచించుకోవాలని తనదైన శైలిలో కోరారు. నాయకుల ఆలోచనలు, పనితీరు చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలన్నారు. ఎవరెవరి వైఖరి ఎలా ఉంది అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రసంగాలంటే.. విపక్ష నేతలపై విరుచుకుపడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో బద్మాష్ బీజేపీ అని విరుచుకుపడ్డారు.కానీ.. ఎల్బీ స్టేడియంసభలో ఆయన బీజేపీ ప్రస్తావన లేకుండానే.. ప్రసంగాన్ని కొనసాగించారు.