G20 Summit 2023: సాధారణ పరిపాలన వ్యవహారాలలో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి కూడా అట్టహాసంగా ప్రచారం చేయడం నేటి పాలకులకు పరిపాటిగా మారింది. వీటి ద్వారా వారు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి సాధారణ అంశాన్ని కూడా అనూహ్యమైన సాహసోపేత చర్యగా అభివర్ణిస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం మామూలైపోయింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతున్నట్టుగా ప్రతీ కార్యక్రమాన్ని ప్రస్తుత పాలకులు ప్రచారం చేస్తున్నారు. ఈ దిశగా గత కొద్ది నెలలుగా జీ_20 శిఖరాగ్ర సదస్సు విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రచారం చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. రాబోయే లోక్సభ సాధారణ ఎన్నికలకు ప్రచార వేదికగా g20 సదస్సును మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తోంది అనే ప్రతిపక్షాల ఆరోపణలలో సహేతుకత లేకపోలేదు. జీ_20 శిఖరాగ్ర సదస్సు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, జమిలీ ఎన్నికలు ఈ మూడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృషి ఫలితంగా భారతదేశానికి జి _20 అధ్యక్ష పదవి లభించినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఈ కూటమి అధ్యక్ష పదవిని అనేక ఇతర దేశాలు కూడా చేపట్టాయి. జి_20 అధ్యక్ష పదవి ప్రతీ సభ్య దేశానికి వంతు ప్రకారం దక్కుతుంది. ఈ మేరకు ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించింది. అంతకుముందు సౌదీ అరేబియా అధ్యక్ష స్థానంలో ఉంది. అరేబియా నుంచి ఇండోనేషియా కు అధ్యక్ష బాధ్యతలను బదిలీ చేసే క్రమంలో రియాద్, ఆ తర్వాత ఇండోనేషియా నుంచి ఇండియాకు అధ్యక్ష పదవిని అప్పగించే సందర్భంగా బాలిలోనూ జీ_ 20 శిఖరాగ్ర సదస్సులు జరిగాయి. బాలి సదస్సులో భారత్ అనేక ప్రతిపాదనలతో క్రియాశీలకంగా వ్యవహరించింది. ఒక రకంగా చెప్పాలంటే మన విదేశాంగ శాఖ గత ఏడాది కాలంగా న్యూఢిల్లీలో జి20 శిఖరాగ్ర సదస్సు సన్నాహక ప్రయత్నాలలో పూర్తిగా నిమగ్నమై ఉంది.
వాస్తవానికి అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, లో కెనడా, ఇటలీ, బ్రిటన్ లు జీ_7 కూటమిగా ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించడం విధితమే. వాస్తవానికి చైనా, భారత్, బ్రెజిల్ దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రభావం 1990 దశకంలో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్థాయిలో పెరిగింది. అయితే ఆ దేశాల మాటకు మన్నన లభించే వేదిక అంటూ లేకపోయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ విపత్కర పరిస్థితిలో నేపథ్యంలో 1999లో జీ_20 కూటమిని నెలకొల్పేందుకు కెనడా చొరవ చెప్పింది. వాటి ప్రధానమంత్రి వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ తోడ్పాటు వల్లే జీ_20 కూటమి ఆవిర్భవించింది.. నూతన కూటమి సమావేశాన్ని భారత్ అధ్యక్షతన 2001లో నిర్వహించాలి అనుకున్నారు. ఆ సమయంలో అమెరికాపై ఉగ్రవాద దాడులు జరిగాయి. అమెరికాకు సంఘీభావంగా జి20 వేదికను వాషింగ్టన్ కు మార్చి అక్కడ నిర్వహించారు.
ఇక జీ _20 సమావేశాల కంటే 1983లో ఇరాక్ లో జరగాల్సిన అలీన రాజ్యాల శిఖరాగ్ర సదస్సును ఇరాన్ దేశంతో యుద్ధం కారణంగా చివరి క్షణంలో బాగ్దాద్ లో కాకుండా న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించారు. సమయం లేకపోయినప్పటికీ నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆ సదస్సును అత్యంత విజయవంతంగా నిర్వహించింది. సదస్సులో వందకు పైగా అలీన దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొన్నారు. మనదేశంలో ఇప్పటివరకు ఆ స్థాయిలో ఏ సదస్సు కూడా జరగలేదు. విజ్ఞత కలిగిన పాలనా దురంధరులకు, అన్నింట ప్రచారమే లక్ష్యంగా వ్యవహరించే సగటు రాజకీయ నాయకులకు మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటో అలీన సదస్సు సాఫల్యత నుంచి అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు అగ్రరాజ్యాల పెత్తనానికి నిదర్శనంగా నిలిచిన జీ_7 కూటమికి ప్రత్యామ్నాయంగా వివిధ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల వైవిద్య కూటమి జి_20. అంతర్జాతీయ వ్యవహారాలు, సంబంధాల చరిత్రలో ఈ కూటమి నిస్సందేహంగా ఒక మైలురాయి. అయితే నెహ్రూ ప్రతిపాదించిన అలీన విధానాన్ని అనుసరించిన దేశాలు ప్రచ్చన్న యుద్ధ కాలంలో ప్రపంచ శాంతికి తోడ్పడిన విధంగా వర్తమాన యుగంలో మానవాళి సమస్యల పరిష్కారానికి ఈ జి_20 దోహదం చేయగలదా? ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: G20 summit 2023 interesting things
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com