ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో లవ్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఈ లవ్ జీహాద్ పేరుతో అమాయకులైన అమ్మాయిలను మోసం చేస్తూ బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న కేసులు ఎక్కువ అయ్యాయి. దీంతో గొడవలు, హత్యలు, కేసులు పెట్టుకోవడం పెరిగిపోతోంది. కొన్ని సంఘాలు దీనికి మద్దతు ఇస్తూ పెంచిపోషిస్తున్నాయని తేలింది.
ఈ క్రమలోనే లవ్ జిహాద్ ను అరికట్టేందుకు యూపీ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ మేరకు తమ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకువస్తుందంటూ యోగి ఆధిత్యనాథ్ సంచలన విషయాలను వెల్లడించారు.. ఆడబిడ్డలతో ఎవరూ ఆటలాడినా వారికి అంతిమయాత్ర నిర్వహిస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లను కూడా అంటిస్తామని స్పష్టం చేశారు. ఈ హెచ్చరిక దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఒకవేళ యువకులు వినకపోతే వారికి అంతిమ యాత్ర మొదలైనట్లేనని యూపీ సీఎం తీవ్రంగా హెచ్చరించారు. పెళ్లి కోసం మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందూ యువతులపై కన్నేస్తే వారికి అంతిమయాత్రేనని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూపీలో మతాంతర కార్యకలాపాలను పూర్తిగా నివారించేందుకు యోగి ప్రభుత్వం తీవ్ర కసరత్తలు మొదలుపెట్టింది. ఈ మేరకు కఠిన చట్టాలు చేయనున్నట్లు సీఎం యోగి ఆధిత్యనాథ్ తెలిపారు.
యూపీలోని మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో శనివారం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొని ఈ హెచ్చరికలు పంపారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Funeral if love jihad yogi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com