కరోనా మన జీవితాల నుండి ఎప్పుడు దూరమవుతుందా! ఎప్పుడెప్పుడు తిరిగి మన స్వేచ్చాభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తామో అని ప్రజలు ఆతృతగా వేచి చూస్తున్నారు. తెలుగు సినిమా అభిమానులు వెండి తెర వినోదం లేకపోవటం వల్ల అల్లాడిపోతన్నారు. సాధారణంగా అనాది కాలం నుండి శుక్రవారం రోజున సినిమాలని విడుదల చేయటం అలవాటుగా మారింది. అలాగే పండగలు, ప్రత్యేకమైన రోజులప్పుడు కూడా సినిమాలు రిలీజ్ అయ్యి సెలవ దినాలను క్యాష్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణాలో సంక్రాంతి పండుగ సమయం కొత్త సినిమాల విడుదలకి సరైన సమయంగా పరిగణలోకి తీసుకుంటారు. ఫలితంతో సంబంధం లేకుండా విడుదలైన సినిమాలన్నీ మంచి వసూళ్లను రాబడుతుంటాయి.
Also Read: మహేష్ కుమార్తె నుండి విలువైన మెసేజ్ !
గత సంవత్సరం మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంటపురంలో’, కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’ సినిమాలు కాకుండా తలైవా రజని ‘దర్బార్’ సినిమా కూడా విడుదలయి ప్రేక్షకులని బాగా అలరించాయి. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రత్యేక సడలింపులు, మార్గదర్శకాలతో సినిమా థియేటర్ లని ఓపెన్ చేసినప్పటికీ జనాలు ఇంటి నుండి బయటకి వచ్చి థియేటర్ లో మూవీ చూడటానికి భయ పడుతున్నారు. అలాంటి టైంలో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ధైర్యంగా ముందడుగు వేసి సినిమా పరిశ్రమకి దారి చూయించాడు.
ఆ ధైర్యంతోనే రాబోయే సంక్రాంతికి రిలీజ్ చెయ్యటానికి కొన్ని సినిమా నిర్మాణ సంస్థలు సిద్ధమై ఇప్పటికే విడుదల తేదీలని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొత్తం నాలుగు సినిమాలు మన ముందుకు రాబోతున్నట్లుగా అధికారిక సమాచారం ఉంది.
1. రవితేజ- క్రాక్
మాస్ మహారాజ్ ర్రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. మిగిలిన చిత్రాల రిలీజ్ తేదీల్ని పరిగణలోకి తీసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రేక్షకుల ముందుకు రావాలని చిత్ర నిర్మాణ సంస్థ భావిస్తోందట. జనవరి 1 న విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం అందుతుంది.
2. విజయ్-మాస్టర్
కోలీవుడ్ నుండి ఈ సంక్రాతి కి తెలుగు సినిమాలతో పోటీ పడటానికి స్టార్ హీరో విజయ్ – మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్’ మూవీ రెడీగా ఉంది. కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ మూవీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి జనవరి 13 న రాబోతుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. విజయ్, విజయ్ సేతుపతి లాంటి అగ్ర కధానాయకుల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద అటు కోలీవుడ్ లోనూ మరియు టాలీవుడ్ లోనూ విపరీతమైన అంచనాలున్నాయి.
Also Read: రవితేజ రీల్ కూతురు ఇప్పుడు హీరోయిన్ లా ఉందిగా !
3. రామ్-రెడ్
ఇక మాస్టర్ తర్వాత వస్తున్నట్లుగా ప్రకటించిన తెలుగు సినిమా రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ మూవీ, ఈ సినిమాకి గతంలో రామ్ తో రెండు హిట్ సినిమాలు చేసిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించటంతో ఈ కాంబో మీద తెలుగు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. రామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా అర్దమైయింది. ఇంతవరకు రామ్ తన కెరీర్ లో డ్యుయల్ రోల్ చేయకపోవటంతో ఇదే ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నారు.
4. బెల్లంకొండ సాయి శ్రీనివాస్-అల్లుడు అదుర్స్
ఇక యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ కూడా ఈ సంక్రాంతికే విడుదల చెయ్యాలని నిర్ణయించారు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి రేస్ లో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ తమ జోనర్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఆదరణ ఉంటుందని అందుకీ పోటీలో తాము నిలబడుతున్నట్లుగా చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నారు. వారి నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో, ఈ సంక్రాంతి యుద్ధంలో ఎవరు గెలిచి విజయకేతనం ఎగరేస్తారో తెలియాలంటే మరో 15 రోజులు వెయిట్ చెయ్యాలి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Four movies in sankranthi race
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com