https://oktelugu.com/

Kashi: కాశీలో విచిత్రం.. ప్రతీ హిందూ చూడాల్సిందే

Kashi: దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో కాశీకి ఓ విశిష్టత ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలనేది ప్రతి హిందువు కోరిక. కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వ పాపాలు హరిస్తాయని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ కాశీకి వెళ్లి రావాలని కలలు కంటారు. కాశీ పవిత్రమైన పుణ్యక్షేత్రం. గంగా నది తీరాన కొలువైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. హైందవ ఆలయాల్లో కాశీ క్షేత్రమే భిన్నమైనది. అందుకే అందరు కాశీ వెళ్లి పునీతులు కావాలని చూస్తుంటారు. కాశీ విశ్వనాథుడిని దర్శించి మొక్కులు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 26, 2023 / 03:50 PM IST
    Follow us on

    Kashi

    Kashi: దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో కాశీకి ఓ విశిష్టత ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలనేది ప్రతి హిందువు కోరిక. కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వ పాపాలు హరిస్తాయని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ కాశీకి వెళ్లి రావాలని కలలు కంటారు. కాశీ పవిత్రమైన పుణ్యక్షేత్రం. గంగా నది తీరాన కొలువైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. హైందవ ఆలయాల్లో కాశీ క్షేత్రమే భిన్నమైనది. అందుకే అందరు కాశీ వెళ్లి పునీతులు కావాలని చూస్తుంటారు. కాశీ విశ్వనాథుడిని దర్శించి మొక్కులు తీర్చుకోవాలని తపిస్తుంటారు.

    చెప్పులు కుట్టుకుని..

    కాశీలో ఒక భక్తుడు ఉండేవాడు. అతడి పేరు రెహమా దాస్. కడు పేదవాడు. చెప్పులు కుట్టుకుని జీవించేవాడు. అక్కడ ఓ బ్రాహ్మణుడు కూడా నివసించేవాడు. బ్రాహ్మణుడు నిత్యం గంగ దగ్గరకు వెళ్లి పుష్పాలతో గంగాదేవిని ప్రార్థించేవాడు. ఒక రోజు బ్రాహ్మణుడు రెహమా దాస్ తో ఇలా అన్నాడు. నువ్వు చెప్పులు కుట్టుకుని కష్టాలు పడే కంటే గంగలో స్నానం చేస్తే దారిద్ర్యాన్ని పోగొట్టుకోవచ్చు కదా అంటాడు. దానికి రెహమా దాస్ అక్కడకు వచ్చే సమయం లేదు. నా దగ్గర రెండు అరటి పండ్లు ఉన్నాయి. అవి గంగాదేవికి ఇవ్వండి అని చెబుతాడు.

    ఆకాశ వాణి

    ఆ పండ్లను బ్రాహ్మణుడు నదిలో వేస్తాడు. అప్పుడు ఒక విశాలమైన చేయి బయటకు వచ్చి ఓ బంగారు చేయి బయటకు వస్తుంది. దానికి ఓ బంగారు గాజు ఉంటుంది. వెంటనే ఓ ఆకాశ వాణి వినిపిస్తుంది. ఈ బంగారు గాజు ప్రియ భక్తులు రెహమా దాస్ కు ఇవ్వాలని చెబుతుంది. దీంతో బ్రాహ్మణుడు ఆ గాజు తీసుకుని వెళ్లి రెహమా దాస్ కు ఇస్తాడు. దానికి అతడు నేను దీన్ని ఏం చేసుకోను మీరే ఉంచుకోండి స్వామి అంటాడు. బంగారు గాజును ఓ దుకాణంలో అమ్మి డబ్బు తీసుకుని అవసరాలు తీర్చుకుంటాడు.

    ఇంకో గాజు

    కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ బంగారు గాజును ఓ సేటు వచ్చి కొనుగోలు చేస్తాడు. దాన్ని తన భార్యకు ఇస్తాడు. అతడి భార్య రాణి మిత్రురాలు కావడంతో ఆ బంగారు గాజు ఎక్కడ చేయించావని అడుగుతుంది. దానికి సేటు భార్య ఇది చేయించింది కాదు. నచ్చితే తీసుకోండి అని అంటుంది. దీంతో రాణి ఇలాంటి గాజు ఇంకోటి కావాలని రాజును అడుగుతుంది. అప్పుడు రాజు సేటుని పిలిపించి ఈ గాజు ఎక్కడ చేయించావు అని అడుగుతాడు. ఇది చేయించలేదు దుకాణంలో కొన్నానని చెబుతాడు. దీంతో రాజు ఆ దుకాణానికి వెళ్లి గాజు గురించి అడగ్గా ఒక బ్రాహ్మణుడు ఆ గాజు ఇచ్చాడని చెప్పాడు. సైనికులను ఆ బ్రాహ్మణుడి ఇంటికి పంపి తీసుకురమ్మని పంపిస్తాడు. నువ్వు బీదవాడిలా ఉన్నావు. నీకు బంగారు గాజు ఎక్కడ నుంచి వచ్చిందని అడుగుతాడు. గంగామాత తనకు ఈ గాజు ఇచ్చిందని వివరిస్తాడు.

    Kashi

    అమ్మ ప్రేమతో..

    బ్రాహ్మణుడు చెప్పింది రాజు మొదట నమ్మక రెహమాదాస్ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకో గాజు కావాలని అంటాడు. దానికి రెహమా దాస్ అది కుదరదు. అది అమ్మ నాకు ప్రేమతో ఇచ్చింది. నేను మళ్లీ ఎలా అడుగుతాను అంటాడు. కానీ రాజు ప్రాధేయపడటంతో ఏం చేయాలో అతడికి అర్థం కాదు. అప్పుడు అతడు ఆలోచనలో పడతాడు. ఈ అద్భుతం నిజంగా జరిగిందే. అందుకే కాశీకి వెళితే పుణ్యం వస్తుందని చెబుతారు. అలా గంగామాత అనుగ్రహంతో ఓ భక్తుడికి ఆమె అందించిన ఆపన్నహస్తమే ఈ గాజు.

    Tags