
Mohan Babu: మంచు శిఖరం కాస్తా అగ్నిపర్వతంలా పేలింది. మోహన్ బాబు కొడుకుల విభేదాలు తారాస్థాయికి చేరాయి. మనోజ్-విష్ణు మధ్య పచ్చి గడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కొన్ని నెలల క్రితమే విష్ణుతో మనోజ్ కి చెడింది. గత ఏడాది నవంబర్ లో విష్ణుకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మనోజ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. దాన్ని విష్ణు పట్టించుకోలేదు. ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇక మీడియాలో సైతం వరుస కథనాలు వెలువడ్డాయి. మోహన్ బాబు కుటుంబంలో గొడవలు, మనోజ్ ఇంటిని వదిలిపోయాడంటూ వార్తలొచ్చాయి. మంచు లక్ష్మి వీటిని ఖండించారు.
ఎట్టకేలకు మనోజ్ విడుదల చేసిన వీడియోతో స్పష్టత వచ్చేసింది. ప్రచారం అవుతున్న వార్తలు నిజమే అని తేలిపోయింది. ఇద్దరు కొడుకుల మధ్య నడుస్తున్న ఈ యుద్ధంలో మోహన్ బాబు ఎవరికి సప్పోర్ట్ ఇస్తున్నాడనే సందేహాలు ఉన్నాయి. రెండు రోజులుగా టాలీవుడ్ లో మంచు బ్రదర్స్ మేటర్ హాట్ టాపిక్ గా ఉంది. మోహన్ బాబు మీడియా ముందుకు రాలేదు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
అయితే మొదటి నుండి మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు పక్షమే… మనోజ్ తో పోల్చుకుంటే విష్ణు మీద ఆయనకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇద్దరు కొడుకులు కెరీర్స్ కి మోహన్ బాబు సప్పోర్ట్ చేశారు. అయితే విష్ణును మరింతగా ప్రోత్సహించారు. మనోజ్, విష్ణు ఇద్దరూ ప్లాప్ హీరోలే. విష్ణు మాత్రం మోహన్ బాబు డబ్బులతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ మనోజ్ కి ఐదేళ్లు గ్యాప్ వచ్చింది.

ఈ క్రమంలో ఓ పాత వీడియో వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో జరిగిన సెలబ్రిటీ లీగ్ లో విష్ణు, మనోజ్ పాల్గొన్నారు. చెరో జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఎవరి టీమ్ బెస్ట్ అని మోహన్ బాబును అడగ్గా… ఆయన నిర్మొహమాటంగా విష్ణు టీమ్ అన్నారు. నేను ధర్మం మాట్లాడతాను. న్యాయం పక్కనే ఉంటాను. నిజంగా ఇక్కడ మనోజ్ కంటే విష్ణు టీమ్ కష్టపడింది. నా సప్పోర్ట్ విష్ణుకే అన్నాడు. మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు నేపథ్యంలో ఈ ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది.