Shayani Ekadashi : తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి? విష్ణువు నిద్రలోకి వెళతారా? ఈరోజు ఏం చేయాలి?

ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్ర పోతారని చెబుతుంటారు. ఆయన నిజంగా నిద్రపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది. ఎప్పుడు చైతన్యవంతంగా ఉండే దేవుడు కదా మరి ఆయన నిద్రపోతే సృష్టి ఎలా సాగుతుందని ప్రశ్నలు రావడం సహజమే

Written By: NARESH, Updated On : June 28, 2023 9:39 pm
Follow us on

Shayani Ekadashi : హిందువుల తొలి పండగ ఏకాదశి. దీని తరువాత వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది వంటి పండగలు వస్తాయి. తొలి ఏకాదశికి ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని శయన ఏకాదశి, హరివాసరం, పేలాల ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఆషాఢంలో వచ్చే శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశిగా పేర్కొంటారు. ఈ సారి పండగ జూన్ 29 గురువారం నాడు వచ్చింది. తొలి ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చాలా మంది ఉపవాసం ఉంటారు. జాగారం కూడా చేస్తారు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసి జాగరం ఉంటే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

సంవత్సరానికి 24

ఏకాదశులు సంవత్సరానికి 24 వస్తాయి. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశినాడు వచ్చే దాన్నితొలి ఏకాదశిగా చెబుతారు. క్షీర సాగర మథనంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు నిద్ర లేస్తాడట. చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రి పూట మొదలవుతుందట. అందుకే దీన్ని దేవ శయన ఏకాదశి లేదా హరిశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడట. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణం దిశకు వాలుతున్నట్లు అనిపిస్తాడు. ఏకాదశులు నెలకు రెండు చొప్పున ఏడాదికి 24 వస్తుంటాయి.

విష్ణువు నిజంగానే నిద్రపోతారా?

ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్ర పోతారని చెబుతుంటారు. ఆయన నిజంగా నిద్రపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది. ఎప్పుడు చైతన్యవంతంగా ఉండే దేవుడు కదా మరి ఆయన నిద్రపోతే సృష్టి ఎలా సాగుతుందని ప్రశ్నలు రావడం సహజమే. భగవంతుడే నిద్రపోతే మనల్ని కాపాడేది ఎవరు? ఈ రోజు నుండి ఒంటిపూట భోజనం చేయడం మంచిది. ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సంకేతాలుగా చెబుతారు. తొలి ఏకాదశి పర్వదినం రోజు దేవుళ్లకు పూజలు చేయడం ఆనవాయితీ.

తొలి ఏకాదశి తిథి రావడానికి..

తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడిో యుద్ధం చేసిన విష్ణువు అలసి శయనిస్తాడు. దేవుడు నిద్రలో ఉండగా రాక్షసులు దేవతలపై దండెత్తుతారు. దేవతలు వైకుంఠానికి పరుగులు తీస్తారు. విష్ణువు శరీరం నుంచి ఉద్భవించిన సత్ల్యశక్తి రాక్షసులను కట్టడి చేస్తుంది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజును ఏకాదశి అని పేరు పెట్టారట. అప్పుడు విష్ణువు ఆమె చేసిన సాయానికి సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా తాను విష్ణు ప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె పేరు ఏకాదశి తిథిగా నామకరణం చేసి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చిందని చెబుతారు.

ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి

ఏకాదశి వ్రతాన్ని పాటించే వారు దశమి నాడే నిహారులై ఉండాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానాలు పూర్తి చేసుకుని విష్ణువును పూజించాలి. రోజు మొత్తం ఉపవాస దీక్ష కొనసాగించాలి. అబద్ధాలు పలకరాదు. స్త్రీ సాంగత్యం చేయరాదు. దుష్ట ఆలోచనలు చేయరాదు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు ఉదయమే స్నానం చేసి మళ్లీ విష్ణువును ఆరాధించాలి. తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది ఉడికినివి, వండినవి తినకూడదు. మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి వంటి పండ్డు కూడా తినకూడదు.