https://oktelugu.com/

Sankranthi: తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండగే సంక్రాంతి.. సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Sankranthi: తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా నాలుగు రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ కోసం పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కరు పల్లెలకు చేరుకొని అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులపాటు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఎంతో వైభవంగా జరుపుకునే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2022 / 11:00 AM IST
    Follow us on

    Sankranthi: తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా నాలుగు రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ కోసం పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కరు పల్లెలకు చేరుకొని అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులపాటు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే…

    భోగితో మొదలయ్యే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఉన్న చెత్తను మన మనసులో ఉన్న చెడు ఆలోచనలను భోగి మంటల రూపంలో దహనం చేసి మంచితో ప్రారంభించాలని భోగిపండుగ సూచిస్తుంది.అదేవిధంగా భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం కూడా సాంప్రదాయం. భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతీక.స్వామి వారికి ఎంతో ఇష్టమైన పళ్లను పిల్లలపై వేయటం వల్ల స్వామివారి కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండి ఆయురారోగ్యాలతో ఉంటారని భావిస్తారు.

    సూర్యుడు దక్షిణాయణం కాలం పూర్తి చేసుకుని ఉత్తరాయణ కాలంలో ప్రవేశిస్తాడు. ఇలా ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశించే సూర్యుడు ముందుగా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు.మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు సంబంధించిన కనుక ఈరోజు సూర్య భగవానుడిని పూజించడం వల్ల సకల సంతోషాలను పొందవచ్చు.

    ఇక సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరు రంగు రంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు. గొబ్బెమ్మలను సాక్షాత్తు గోదాదేవిగా భావించి పూజిస్తారు. అలాగే ఈ పండుగ రోజు డూడూ బసవన్నలు, హరిదాసు గీతాలు, ఎన్నో రకాల పిండి వంటలు, కోడి పందాలు, గాలి పటాలు ఎగుర వేయడం వంటి ఎన్నో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇక కనుమ రోజు కూడా ప్రత్యేకంగా గారెలను తయారు చేసుకొని తింటారు. ఈ సంప్రదాయాన్ని కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటిస్తారు. కనుమ రోజు గారెలు నాటుకోడికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.