https://oktelugu.com/

Tragedy: విషాదం : రోడ్డు ప్రమాదంలో నటి.. కూతురు మృతి !

Tragedy: బెంగళూరులో ఓ నటి ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయింది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు ఆమె ఆరేళ్ల కూతురితో కలిసి స్కూటీ పై వెళ్తుండగా అనుకోకుండా ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అమృత 6 ఏళ్ల కూతురు సమన్వి అక్కడిక్కడే మృతి చెందడం బాధాకరమైన విషయం. అమృతా నాయుడికి తీవ్రగాయాలు అయ్యాయి. పైగా ఆమె 4 నెలల గర్భిణి కూడా. ప్రస్తుతం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 14, 2022 / 10:54 AM IST
    Follow us on

    Tragedy: బెంగళూరులో ఓ నటి ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయింది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు ఆమె ఆరేళ్ల కూతురితో కలిసి స్కూటీ పై వెళ్తుండగా అనుకోకుండా ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అమృత 6 ఏళ్ల కూతురు సమన్వి అక్కడిక్కడే మృతి చెందడం బాధాకరమైన విషయం. అమృతా నాయుడికి తీవ్రగాయాలు అయ్యాయి.

    Tragedy

    పైగా ఆమె 4 నెలల గర్భిణి కూడా. ప్రస్తుతం నటి అమృత తీవ్రగాయాలతో ICUలో చికిత్స తీసుకుంటుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక, మృతి చెందిన చిన్నారి సమన్వి కూడా పలు రియాల్టీ షోలతో పేరు తెచ్చుకొని చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. భవిష్యత్తులో సమన్వి గొప్ప నటి అవుతుంది అని ఆమె గురించి పలువురు సినీ ప్రముఖులు కూడా గతంలో అనేకసార్లు చెప్పారు.

    Also Read:  పూరి నుంచి మరో క్రేజీ పాఠం.. ప్రతి మనిషికీ అది ఉండాలి !

    అలాంటి మంచి భవిష్యత్తు ఉన్న సమన్వి ఇలా అనుకోకుండా ప్రమాదానికి గురి అయి ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైన అంశం. అమృతా నాయుడికి ఆమె కూతురికి రోడ్డు ప్రమాదం జరిగింది అనగానే.. తోటి కన్నడ సినీ కళాకారులు విచారణ వ్యక్తం చేశారు. అమృతా నాయుడు చాలా మంచి వ్యక్తి అని, ఆమె ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుందని.. అలాంటి ఆమెకు ఇలా జరగడం చాలా దురదృష్టకరమైన విషయం అని కన్నడ నటీనటులు చెప్పుకొచ్చారు. మరి అమృతా నాయుడు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

    Also Read:  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

    Tags