Gudimallam Lingam: హిందువులలో పరమశివుడిని ఎంత భక్తితో పూజిస్తారో అందరికీ తెలిసిందే. హిందువుల ప్రధాన దేవుళ్లలో శివుడు మొదటి స్థానంలో ఉన్నాడు. కేవలం ఇండియాలోనే కాదండోయ్.. ప్రపంచ వ్యాప్తంగా కూడా శివుడికి చాలా గుడులు ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు పురాతన విగ్రహాలు, గుడులు బయటపడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
కాగా ఇప్పుడు మన తిరుపతికి దగ్గరలో ప్రపంచంలోనే అత్యంత పురాతన విగ్రహం ఒకటి ఉంది. దాని గురించిన విశేషాలను తెలుసుకుందాం. తిరుమల దేవస్థానానికి దగ్గరలో ఉన్న గుడిమల్లం ఏరియాలో ఈ పురాతన విగ్రహం ఉంది. రేణిగుంట ఏరియా నుంచి ఈ పురాతన విగ్రహానకిఇ దాదాపు 10 కిలోమీటర్లు దూరం ఉటుంది.
Also Read: పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు
ఒకవేళ తిరుపతి నుంచి నేరుగా వెళ్లే వారికి మాత్రం 20 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇక్కడు కొలువు దీరిన శివయ్య.. మనకు భిన్న ఆకృతిలో దర్శనం ఇస్తాడు. ఇక ఈ పురాతన లింగంమీద పరమశివుడి బొమ్మను చెక్కినట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఈ శివలింగం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా చెబుతున్నారు పురాతన వస్తు శాస్త్రవేత్తలు.
ఈ విగ్రహం క్రీస్తు పూర్వం 3వ శతాబ్లంకు చెందినదని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆ శివలింగాన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనిదిగా వివరిస్తున్నారు. అయితే ఈ శివలింగం మాత్రం ఇతర లింగాలకంటే కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే ఇది మిగతా ఆలయాల కంటే చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కాగా ఇలాంటి పురాతన శివలింగాలు ప్రపంచలో ఇంకో రెండు ఉన్నాయంటున్నారు. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని మధుర మ్యూజియంలో ఉండగా.. దాన్ని దాన్ని భీత లింగం అని పిలుస్తుంటారు. రెండోది అమెరికాలోని ఫిలడెల్ఫియా మ్యూజియంలో ఉంది. ఇది కూడా మొదట్లో మధురలోనే ఉండేది. కానీ పూర్వం తరలిపోయింది. ఇలాంటి పురాతన శివలింగాలు ప్రస్తుతం మూడు ఉన్నాయి.
Also Read: మోడీ సార్ బాదుడు మొదలెట్టాడు.. వామ్మో గ్యాస్.. మళ్లీ పెట్రో మంటలు
Recommended Video: