KCR vs BJP: బీజేపీతో యుద్ధానికి సిద్ధమవుతున్న కేసీఆర్ ?

KCR vs BJP: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం తాజాగా మళ్లీ మొదలైంది. కేసీఆర్ బీజేపీని టార్గెల్ చేసుకుని మరోసారి పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఆయన మరోమారు మీడియా ముందుకు వస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలే లక్ష్యంగా విమర్శలు చేసేందుకు కదులుతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశాన్ని దేశవ్యాప్తంగా ఎండగట్టాలని భావించినా అది నెరవేరలేదు. దీంతో ఇంకోసారి కూడా ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకోనున్నారు. కేసీఆర్ మళ్లీ […]

Written By: Srinivas, Updated On : March 22, 2022 3:53 pm
Follow us on

KCR vs BJP: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం తాజాగా మళ్లీ మొదలైంది. కేసీఆర్ బీజేపీని టార్గెల్ చేసుకుని మరోసారి పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఆయన మరోమారు మీడియా ముందుకు వస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలే లక్ష్యంగా విమర్శలు చేసేందుకు కదులుతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశాన్ని దేశవ్యాప్తంగా ఎండగట్టాలని భావించినా అది నెరవేరలేదు. దీంతో ఇంకోసారి కూడా ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకోనున్నారు.

KCR vs BJP

కేసీఆర్ మళ్లీ ధాన్యం కొనుగోలును సాకుగా చూపేందుకు నిర్ణయించుకున్నారు. దేశంలో బీజేపీ ప్రతిష్ట దిగజార్చేందుకు కంకణం కట్టుకున్నారు. మూడో కూటమి ప్రయత్నాలు ప్రస్తుతానికి మరుగున పడినా బీజేపీపై యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది.

Also Read:  పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు

2024 ఎన్నికలే లక్ష్యంగా రెండు పార్టీలు తమ వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తమ ప్రభావం చూపించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి గాను అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కొద్ది రోజుల గ్యాప్ తరువాత మళ్లీ స్వరం పెంచుతోంది. బీజేపీపై ప్రత్యక్షంగా పోరాటానికి రెడీ అవుతోంది.

దేశంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని బీజేపీని ఎదుర్కోవాలని చూస్తున్న టీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయా అనేది సందేహమే. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని ఎదుర్కొని నిలువగలదా అనే సందేహాలు వస్తున్నాయి. ఏదిఏమైనా కేసీఆర్ పాచికలు పారే సమయం అయిపోయింది. ఇన్నాళ్లు గొర్రెల్లా నమ్మిన ప్రజలను తప్పుదారి పట్టించే మాటలను ప్రజలు విశ్వసిస్తారా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నా నిష్ర్పయోజనమే అని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేసీఆర్ ఆశలు నెరవేరి బీజేపీని నిలువరించగలరా అని పలు రకాలుగా చర్చలు జరుగుతుండటం విశేషం.

TRS vs BJP

ముందస్తు ఎన్నికలపై మాత్రం కేసీఆర్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో గడువు ముగిసిన తరువాతే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా చేసుకుని పోరాటానికి వెళ్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు బీజేపీ కూడా సిద్ధంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆశలు మాత్రం లేవని చెబుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ బీజేపీనే పోటీగా భావించి ఎన్నికలకు వెళ్తుందనేది నిర్వివాదాంశమే.

Also Read: అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయే.. మోడీ సార్ వీర బాదుడు మొదలాయే

Recommended Video:

Tags