https://oktelugu.com/

Pooja: వారంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో తెలుసా?

Pooja: మనకు ఆధ్యాత్మికత ఎక్కువే. రోజు దేవుడికి మొక్కనిదే ఏ పని మొదలు పెట్టం. దైవ భక్తితో కాలం గడుపుతుంటాం. ప్రతి రోజు లేస్తూనే జై శ్రీరామ్, ఓం నమశ్శివాయ అంటూ నిద్ర నుంచి లేస్తాం. మమ్మల్ని చల్లంగా చూడు దేవుడా అని మొర పెట్టుకుంటాం. దేవుడిని నిత్యం కొలుస్తూ తరిస్తాం. మహిళలైతే దేవుడికి దీపం పెట్టంది కనీసం మంచినీళ్లు కూడా ముట్టరు. ఇలా మనం దేవుళ్లను కొలవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏ రోజు ఏ దేవుడిని.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 21, 2023 / 08:03 AM IST
    Follow us on

    Pooja

    Pooja: మనకు ఆధ్యాత్మికత ఎక్కువే. రోజు దేవుడికి మొక్కనిదే ఏ పని మొదలు పెట్టం. దైవ భక్తితో కాలం గడుపుతుంటాం. ప్రతి రోజు లేస్తూనే జై శ్రీరామ్, ఓం నమశ్శివాయ అంటూ నిద్ర నుంచి లేస్తాం. మమ్మల్ని చల్లంగా చూడు దేవుడా అని మొర పెట్టుకుంటాం. దేవుడిని నిత్యం కొలుస్తూ తరిస్తాం. మహిళలైతే దేవుడికి దీపం పెట్టంది కనీసం మంచినీళ్లు కూడా ముట్టరు. ఇలా మనం దేవుళ్లను కొలవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.

    ఏ రోజు ఏ దేవుడిని..

    మనం రోజుకో దేవుడిని కొలవడం అలవాటు. ఆదివారం నుంచి శనివారం వరకు రోజుకు ఓ దేవుడిని పూజించడానికి మొగ్గు చూపుతాం. ఆ రోజు ఆ దేవుడిని కొలిస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో రోజుకో దేవుడిని మొక్కుతాం. తమను కాపాడాలని వేడుకుంటాం. మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంచాలని ప్రార్థిస్తుంటారు.

    ఆదివారం సూర్యభగవానుడికి..

    ఆదివారం సూర్యుడిని కొలుస్తారు. సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. కనిపించే దేవుడిగా సూర్యుడిని భావిస్తుంటాం. అందుకే ఆదివారం సూర్యుడికి మొక్కడం చేస్తుంటాం. ఈ క్రమంలో ఆదివారం మాంసం తినొద్దు. గోర్లు తీయొద్దు. మగువతో సంగమించకూడదు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవరు పాటించడం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం తినేందుకే మొగ్గు చూపుతున్నారు.

    సోమవారం శివుడికి..

    సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజు పరమశివుడిని పవిత్రంగా కొలుస్తారు. ఇక మంగళవారం ఆంజనేయుడికి ఇష్టమైన రోజు కావడంతో తమలపాకులతో హనుమంతుడిని పూజిస్తారు. బుధవారం వినాయకుడికి ఇష్టం. ఈ రోజు గణపతిని గరికతో పూజిస్తే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అందరు దేవుళ్లలో వినాయకుడికి ముందు పూజ చేయడం ఆనవాయితీ.

    Pooja

    గురువారం సాయిబాబాకు..

    గురువారం సాయిబాబాకు ప్రీతిపాత్రమైన రోజు. గురువారం గురువును పూజిస్తే మంచిది. అందుకే సాయిబాబాను కొలవడం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఇక శుక్రవారం మహాలక్ష్మిని పూజించాలి. అమ్మవారిని కొలవడం వల్ల లక్ష్మీ మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వరుడికి ఎంతో ఇష్టం. శనివారం వడ్డీకాసుల వాడిని వేడుకుంటారు. ఇలా రోజుకో దేవుడిని పూజించి మన కష్టాలు దూరం చేయాలని కోరుకోవడం సహజం.

    Tags