Nandi: శివుడిని నంది కొమ్ములలో నుంచి దర్శనం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?

Nandi: సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటాము.ఇలా ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఈ విధంగానే దర్శనం చేసుకుంటాము. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోకుండా ముందుగా స్వామి వారికి వాహనమైన నందీశ్వరుడు కొమ్ముల్లో నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటాము.అయితే ఈ విధంగా పరమేశ్వరుడిని నంది కొమ్ములలో దర్శనం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ […]

Written By: Kusuma Aggunna, Updated On : March 7, 2022 1:09 pm
Follow us on

Nandi: సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటాము.ఇలా ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఈ విధంగానే దర్శనం చేసుకుంటాము. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోకుండా ముందుగా స్వామి వారికి వాహనమైన నందీశ్వరుడు కొమ్ముల్లో నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటాము.అయితే ఈ విధంగా పరమేశ్వరుడిని నంది కొమ్ములలో దర్శనం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

పరమేశ్వరుడు మనకు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తారు. అయితే పరమేశ్వరుడు లయకారకుడు ఆయన మూడవ కంటిని తెరిస్తే విశ్వమే అంతమవుతుంది. కనుక అలాంటి శక్తివంతమైన పరమేశ్వరుడిని నేరుగా దర్శించుకోకూడదు అలా దర్శించుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అందుకే పరమేశ్వరుడిని నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు.

పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళిన తర్వాత ముందుగా కుడి చేతితో నందిని వీపుపై నిమురుతూ మన గోత్రనామాలను మన కోరికలను నందీశ్వరుడి చెవిలో చెప్పాలి.ఇలా పరమేశ్వరుడిని ఎప్పుడు నేరుగా కాకుండా నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలి.ఇలా పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నప్పుడే మన కోరికలు నెరవేరడమే కాకుండా మనకు ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి.