Bheemla Nayak Box Office Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. రానా, పవన్ పోటాపోటీగా నటించిన ఈ మూవీకి ఎదురే లేకుండా పోయింది. ప్రభాస్ రాధేశ్యామ్ విడుదలయ్యే వరకూ పోటీ లేకపోవడం.. విడుదలైన చిన్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో సినిమాకు కలెక్షన్లు కంటిన్యూ అవుతున్నాయి.
భీమ్లానాయక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారాన్ని పూర్తి చేసుకొని రెండో వారంలోకి ప్రవేశించింది. సెకండ్ వీక్ లో కొంచెం స్లోగా పరుగులు తీస్తోంది.
Also Read: IPL 2022 Full Schedule: ఐపీఎల్ 2022 షెడ్యూల్ ఇదీ.. పాత ఫైనలిస్టుల మధ్య తొలి పోటీ
9వ రోజు శనివారం వీకెండ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద కొంచెం మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక 10వ రోజు ఆదివారం కావడంతో మరోసారి డీసెంట్ గా డబ్బులు సంపాదించింది. ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 20శాతం టు 25శాతం వరకూ పెరుగుదల కనిపించింది. అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగున్నాయి. 10వరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల కలెక్షన్లు సాధించింది. 11వ రోజు 1.8 కోట్ల వరకూ కలెక్షన్లు అందుకుంది. ఓవరాల్ గా భీమ్లానాయక్ కలెక్షన్లు 200 కోట్లు దాటేశాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
భీమ్లానాయక్ మూవీ ఊపుతో టాలీవుడ్ కు కొత్త కళ వచ్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ కు ఇది ప్లస్ అయ్యింది. జనాలు కరోనా భయం వీడి థియేటర్లకు వస్తుండడంతో సినిమాకు ఖచ్చితంగా ప్లస్ కానుంది..
Also Read:KA Paul: రామోజీరావు నాకు 22 లక్షలు ఇవ్వాలి: బాంబు పేల్చిన కేఏపాల్