Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితంలో ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో కష్టాలు ఎదురైన సమయంలో ఎలా వ్యవహరించాలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నీతి శాస్త్రం ద్వారా వెల్లడించారు. భార్యను ఎంపిక చేసుకునే సమయంలో కొన్ని లక్షణాలు ఉన్న భార్య దొరికితే అస్సలు వదులుకోవద్దని చాణక్యుడు సూచించారు. ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న భార్య దొరికితే జీవితాంతం సంతోషంగా జీవనం సాగించవచ్చు.
భార్యను ఎంపిక చేసుకునే సమయంలో సహనంగా ఉండే స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి. సహనంగా ఉండే స్త్రీలు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓపికతో వ్యవహరిస్తారు. సహనంతో ఉండే స్త్రీలు అనవసరమైన విషయాలకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు. భర్తకు తన వంతు సహాయం అందించే విషయంలో ఇలాంటి స్త్రీలు ముందువరసలో ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో కూడా ఇలాంటి స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుని ముందడుగులు వేస్తారు.
ఇతరులతో మంచితనంతో, మర్యాదగా మాట్లాడే స్త్రీని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే ఆమె వల్ల గొడవలు వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇలాంటి స్త్రీల వల్ల కుటుంబ గౌరవం, పరువుప్రతిష్టలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. సనాతన ధర్మం పాటించే మహిళను వివాహం చేసుకుంటే ఆ మహిళ పిల్లల భవిష్యత్తు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పిల్లలకు మంచి విద్య అందేలా చూస్తుంది.
ఆచార్యసాంప్రదాయాలను పాటించే విషయంలో ఇలాంటి మహిళలు ముందువరసలో ఉంటారు. మీకు కాబోయే భార్యలో ఈ లక్షణాలు ఉంటే మాత్రం అస్సలు వదులుకోవద్దని చాణక్యుడు నీతిశాస్త్రం ద్వారా సూచిస్తున్నారు. ఇలాంటి భార్య దురదృష్టాన్ని కూడా లక్ గా మరుస్తుందని చాణక్యుడు చెప్పారు.