Devotional Tips: మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పరమ పవిత్రమైనవిగా భావిస్తాము. ఇలా పవిత్రంగా భావించే వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తూ పూజిస్తాము అయితే ఇలా పవిత్రంగా భావించే కొన్ని రకాల వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు. అలా హిందూ శాస్త్రం ప్రకారం ఏ వస్తువులను కింద పెట్టకూడదు అనే విషయానికి వస్తే….
శంకువు: శంకువు సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తాము. అలా లక్ష్మీ స్వరూపంగా భావించే శంఖాన్ని ఎప్పుడూ కింద పెట్టకూడదు. ఇలా కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లే.
సాలిగ్రామం: సాక్షాత్తు విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని కింద పెట్టకూడదు. సాలి గ్రామాన్ని కింద పెడితే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
దీపం: ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రం దీపారాధన చేసే సమయంలో చాలా మంది దీపం నేలపై పెడతారు. అయితే దీపానికి ఎలాంటి ఆధారం లేకుండా కింద పెట్టడం వల్ల మన జీవితంలో కూడా ఎలాంటి ఆధారం ఉండదని అందుకే దీపం కింద చిన్న ఆకు అయినా ఆధారంగా పెట్టాలని పండితులు చెబుతున్నారు.