
విభిన్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ నుండి వస్తున్న మరో సంచలనాత్మక చిత్రం జాంబీ రెడ్డి. ప్రస్తుత కాలంలో మనుషుల వినాశనానికి కారణమైన సాంకేతికత, మేధా శక్తి కారణంగా సంభవించిన విపరీత పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతుంది. నేడు జాంబి రెడ్డి నుండి ఫస్ట్ బైట్ పేరుతో ఫస్ట్ గ్లిమ్స్ వీడియో విడుదల చేయడం జరిగింది. ఒక నిమిషం నిడివి గల టీజర్ ఆసక్తి కరంగా సాగింది.
Also Read: బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ లిస్ట్ లో ఎన్టీఆర్, మహేష్, చరణ్..!
“దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం, రాక్షస మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం…” అంటూ మొదలైన టీజర్ భీతి గొలిపేలా ఉంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. సాంకేతికత పేరుతో మనిషి చర్యలు అదుపు తప్పితే ఏర్పడే దుర్భర పరిస్థితులను ఈ చిత్రంలో ప్రస్తావించారని అర్థం అవుతుంది. ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ కూడా, మనిషి స్వయంకృతాపరాధమే అని దర్శకుడు ప్రశాంత్ వర్మ, పరోక్షంగా చెప్పారు.
Also Read: సత్యదేవ్ ‘తిమ్మరుసు’ ఫస్ట్ లుక్..
జొంబి రెడ్డి రాయలసీమ నేపథ్యంలో సాగే హారర్ మూవీ అని సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్ వర్మ సందేశం కూడా పొందుపరిచారు. స్టార్ హీరోయిన్ సమంత నేడు ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్