
గుడివాడలో తాపి కార్మిక సంక్షేమ సంఘ నూతన భవనాన్ని ప్రారంభించాడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కార్మిక శాఖ మంత్రి జయరామ్. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 మంది అభ్యర్థులను నిలబెట్ట లేకపోవడం చంద్రబాబునాయుడు అసమర్ధత. పోటీ చేసిన 106 మంది కార్పొరేట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయి, ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేని టీడీపీని జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం అని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోబించెలా, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు పూర్తిగా పతనం చేశాడు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు, ప్రజా నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొడతాననడం అవివేకం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది అని తెలిపారు.