శేఖర్ కమ్ముల అంటేనే సెన్సిబుల్ సినిమాల డైరెక్టర్ అనే బ్రాండ్ క్రియేట్ అయిపొయింది జనంలో. ఆయన సినిమాలు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూడొచ్చు అనే నమ్మకం ఉండటంతో సహజంగానే ముందునుంచి శేఖర్ కమ్ముల సినిమాలకు టీవీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రసుతం థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి లేదు, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి.
Also Read: ప్రభాస్ ప్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రాధేశ్యామ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ఇప్పటికే నాని ‘వి’, సూర్య ‘ఆకాశమే హద్దుగా’, విజయ్ ‘మాస్టర్’ లాంటి సినిమాలు డిజిటల్ టికెట్ ను బుక్ చేసేసుకున్నాయి. ఇప్పుడు వీటి అన్నిటికీ కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న సినిమా లవ్ స్టోరీ. ఈ కరోనా దెబ్బకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు డిమాండ్ పెరిగింది. దాంతోనే మొదటి నుండి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న ఈ ‘లవ్ స్టోరీ’ కోసం బాగా ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరను ఆఫర్ చేస్తోందట.
ఒక్క డిజిటల్ రైట్స్ కే సుమారు 40 కోట్లు ఆఫర్ చేస్తున్నారట. నిజంగా చైతూ గత సినిమాలన్నింటి కంటే ఇది భారీ ధరే. మొన్నటి వరకూ అమెజాన్ పోటీలో ముందు ఉంది. ఇప్పుడు జీ5 రేసులోకి వచ్చి మొత్తానికి లవ్ స్టోరీని ఎగరేసుకుపోయేలా ఉంది. ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడానికి ప్రధాన కారణం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయడానికే. దానితో పాటు ఈ సినిమా కాంబినేషన్ అలాగే శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా ఈ సినిమా బిజినెస్ కి బాగా ప్లస్ అయింది.
Also Read: డిజిటల్ విప్లవంలో రేపటి సినిమాల పరిస్థితి !
కాగా ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావులకు నిర్మాతలుగా ఈ సినిమా బాగానే లాభాలను పొందేలా కనిపిస్తోంది.