Pushpa 2 satellite rights
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఇండియా లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాధించని రికార్డ్స్ అంటూ ఏవి లేవు. ప్రతీ రికార్డుని బద్దలు కొట్టి ఇండియన్ సినిమాకే ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేసింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపుగా 15 మిలియన్ పైగా వ్యూస్ ఈ సినిమాకి వచ్చాయట. హాలీవుడ్ సినిమాలకు కాకుండా, టాలీవుడ్ సినిమాలలో అతి తక్కువ సమయంలో ఈ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకున్న ఏకైక సినిమా ఇదేనట. మొదటి వారం లో 5.3 మిలియన్ వ్యూస్ రావడం ఒక సంచలనం. అయితే ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయ్యేది ఎప్పుడు అనే అంశంపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
‘పుష్ప’ చిత్రం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది కాబట్టి, ‘పుష్ప 2’ కూడా స్టార్ మా ఛానల్ లోనే టెలికాస్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం సాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుందట. గత కొంతకాలంగా జీ తెలుగు లో ప్రసారం అవుతున్న సినిమాలకు పెద్దగా టీఆర్ఫీ రేటింగ్స్ రావడం లేదు. కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రసారమైన సినిమాలలో కేవలం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రానికి మాత్రమే భారీ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఈ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో 20 రేటింగ్స్ రాగా, రెండవ టెలికాస్ట్ నుండి, 7 వ టెలికాస్ట్ వరకు 5 కి తగ్గకుండా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ స్థాయి రేటింగ్స్ ఏ సినిమాకి కూడా రాలేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రం కూడా ఇటీవలే టెలికాస్ట్ అయ్యి కేవలం 5 రేటింగ్స్ ని మాత్రమే దక్కించుకుంది. ఇప్పుడు ఆ సంస్థ ఆశలన్నీ పుష్ప 2 చిత్రం పైనే. ఈ చిత్రాన్ని మహాశివరాత్రికి టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ గత చిత్రాలకు వచ్చిన టీఆర్ఫీ రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే ‘అలా వైకుంఠపురం లో’ చిత్రానికి జెమినీ టీవీ లో 29 టీఆర్ఫీ రేటింగ్స్ రాగా, ఆ తర్వాత విడుదలైన పుష్ప చిత్రానికి స్టార్ మా ఛానల్ లో 23 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఇక జీ తెలుగు లో ప్రసారమైన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రానికి ఏకంగా 24 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఈ రికార్డు ని ఇప్పటి వరకు జీ తెలుగు లో ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. మరి అల్లు అర్జున్ పుష్ప 2 తో తన రికార్డుని తానే బద్దలు కొట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.