https://oktelugu.com/

Zebra Movie Twitter Review: జీబ్రా ట్విట్టర్ టాక్: గట్టిగా కొట్టిన సత్యదేవ్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ తో అలరించే క్రైమ్ థ్రిల్లర్!

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ జీబ్రా అంటూ ప్రేక్షకులను పలకరించాడు. క్రైమ్ థ్రిల్లర్ జీబ్రా నవంబర్ 22న వరల్డ్ వైడ్ నాలుగు భాషల్లో విడుదల చేశారు. గురువారం రాత్రి నుండే హైదరాబాద్ లో పేయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి జీబ్రా మూవీ చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 22, 2024 / 08:00 AM IST

    Zebra Movie Twitter Review

    Follow us on

    Zebra Movie Twitter Review: సత్యదేవ్ కి ఒక హిట్ కావాలి. ఆయనకు హీరోగా అవకాశాలు వస్తున్నప్పటికీ బ్రేక్ రావడం లేదు. పూర్తి స్థాయి హీరో అనిపించుకోలేకపోతున్నాడు. దాంతో స్టార్ హీరోల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సత్యదేవ్ ఆచార్య, రామ్ సేతు, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు. ఆయన హీరోగా నటించిన గత రెండు చిత్రాలు గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేదు.

    చిరంజీవితో అనుబంధం ఉన్న సత్యదేవ్ ఈసారి ఆయన సహకారం తీసుకున్నాడు. జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చిరంజీవి హాజరయ్యారు. దాంతో జీబ్రా చిత్రానికి మంచి ప్రచారం దక్కింది. జీబ్రా మూవీని క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించాడు. కన్నడ నటుడు ధనుంజయ మరో ప్రధాన పాత్ర చేశాడు. ప్రియా భవాని శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్స్. సునీల్, సత్యరాజ్ కీలక రోల్స్ చేసినట్లు సమాచారం. జీబ్రా చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు.

    జీబ్రా మూవీ కథ విషయానికి వస్తే… హీరో సత్యదేవ్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగి. ధనుంజయ పెద్ద గ్యాంగ్ స్టర్. వీరిద్దరి కేంద్రంగా దోపిడీ చోటు చేసుకుంటుంది. అసలు దొంగ ఎవరు? వీరిద్ధరి మధ్య సంఘర్షణ ఏమిటనేది సినిమా నేపథ్యం. కాగా జీబ్రా సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మెజారిటీ ఆడియన్స్ సినిమా బాగుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

    కథలో వచ్చే ట్విస్ట్స్ అలరిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ హైలెట్ గా ఉన్నాయి. దర్శకుడు టైట్ స్క్రీన్ ప్లే తో పాటు అద్భుతమైన సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మలిచాడని అంటున్నారు. ఆడియన్స్ ని ఆద్యంతం సస్పెన్సు లో ఉంచి ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని అంటున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ లో పని చేసిన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తన అనుభవాలతో ఈ కథను ఆసక్తికరంగా మలిచాడని తెలుస్తుంది.

    సత్యదేవ్, ధనుంజయ నటన, వారిద్దరి మధ్య సంఘర్షణ బాగుంది. కాంబినేషన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని అంటున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రియా భవాని శంకర్, అమృత అయ్యంగార్, సునీల్ తమ పాత్రల పరిధిలో మెప్పించారట.

    ఇక ప్రేక్షకులు చెబుతున్న నెగిటివ్ పాయింట్స్ గమనిస్తే.. సంగీతం ఏమంత ప్రభావవంతంగా లేదని అంటున్నారు. సాంగ్స్ తో పాటు బీజీఎం నిరాశపరిచిందట. అలాగే సత్యరాజ్ వంటి యాక్టర్ ని సరిగా వాడుకోలేదు. ఆయనకు సరైన స్క్రీన్ స్పేస్ లేదని అంటున్నారు. మొత్తంగా జీబ్రా బాగుంది. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందని ట్విట్టర్ టాక్.